- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవార్డులు బాధ్యతను పెంచుతాయి : గవర్నర్ తమిళి సై
దిశ, శేరిలింగంపల్లి: ఏ రంగంలో అయినా పురస్కారాలు బాధ్యతను పెంచడంతో పాటు ప్రోత్సాహాన్ని అందిస్తాయని, అన్ని విధాలుగా రాణించేందుకు దోహదపడతాయని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. ప్రతిష్టాత్మక సినీ గోయర్స్ 52వ స్వర్ణోత్సవ ఫిలిం అవార్డుల వేడుకలు శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ.. సమాజంలో అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన వినోద మాధ్యమం సినిమా అని, సమాజ బాగుకోసం బాధ్యతాయుతమైన సినిమాలు నిర్మించాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాల్లో టాలీవుడ్ సినిమాకు ప్రత్యేక గుర్తింపు ఉందని, లక్షల మంది సినిమా రంగంలో ఉపాధి పొందుతున్నారని అభినందించారు.
సమాజంలో నెలకొన్న పరిస్థితులను అధిగమించేందుకు సినిమా రంగం కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. అనంతరం పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. 52 ఏళ్లుగా హైదరాబాద్‌లో అవార్డులు ఇస్తూ సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తున్న సినీ గోయర్స్ ఎంతో ప్రతిష్టాత్మక సంస్థ అని, తాను కూడా పలుమార్లు ఈ పురస్కారాన్ని స్వీకరించి గర్వంగా అనుభూతి చెందినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొని పురస్కారాలు అందించి అభినందించారు. సినీ గోయర్స్ అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు డాక్టర్ పి.శ్రీధర్, బి.రామకృష్ణ పర్యవేక్షించారు. 2019, 2020 సంవత్సరాలకు సంబంధించి పురస్కారాలు ప్రధానం చేశారు. ఫైవ్ డికేడ్స్ సినీ గోయర్స్ పురస్కారాలను దర్శకుడు కె.రాఘవేంద్రరావు, మురళీమోహన్, చిరంజీవి, జయప్రద, ప్రకాష్ రాజ్ స్వీకరించారు. సినీ గోయర్స్ జీవన సాఫల్య పురస్కారాలను డాక్టర్ రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాస రావు అందుకున్నారు.
2019 పురస్కార గ్రహీతలు
ఉత్తమ హీరో, హీరోయిన్లుగా చిరంజీవి (సైరా నరసింహారెడ్డి), తమన్నా (ఎఫ్ 2) అవార్డులు స్వీకరించారు. ఉత్తమ దర్శకుడిగా వంశీ పైడిపల్లి (మహర్షి), ఉత్తమ సంచలన హీరో హీరోయిన్లుగా నాని(జెర్సీ), మెహ్రీన్ (ఎఫ్ 2), ఉత్తమ సంచలన దర్శకుడిగా సురేందర్ రెడ్డి (సైరా నరసింహా రెడ్డి), ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్లుగా రావు రమేష్ (ప్రతి రోజు పండుగే), డాక్టర్ రాజేంద్రప్రసాద్ (ఓహ్ బేబీ), ఆశ్రీత (యాత్ర), ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి), ఉత్తమ విలన్‌గా కబీర్ దుహన్ సింగ్ (యాక్షన్), ఉత్తమ గాయని గాయకులుగా మంగ్లీ(జార్జిరెడ్డి), రాహుల్ సిప్లిగంజ్(మహర్షి), ఉత్తమ గేయ రచయితగా సిరివెన్నెల సీతా రామశాస్త్రి(సైరా), ఉత్తమ సంభాషణల రచయితగా బుర్ర సాయి మాధవ్( సైరా), ఉత్తమ చిత్రంగా జెర్సీ ఎంపికైంది. ప్రత్యేక జ్యూరీ పురస్కారాలను నిత్యాశెట్టి(ఓ పిట్టకథ ), సత్యదేవ్ (బ్రోచే వారెవరురా), అనిల్ రావిపూడి(ఎఫ్ 2), దిల్ రాజు (సరిలేరు నీకెవ్వరూ) గెలుచుకున్నారు.
2020 పురస్కార గ్రహీతలు
ఉత్తమ హీరో, హీరోయిన్లుగా అల్లు అర్జున్(అల వైకుంఠపురంలో), రష్మిక మంథాన (సరిలేరు నీకెవ్వరు), ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (సరిలేరు నీకెవ్వరు), ఉత్తమ సంచలన హీరో హీరోయిన్లుగా సుధీర్ బాబు(వి), పాయల్ రాజపుత్ (డిస్కోరాజా) ఉత్తమ చిత్రంగా అల వైకుంఠపురంలో), ఉత్తమ సంచలన దర్శకుడిగా వెంకీ కొడుముల(భీష్మ) ఎంపికై అవార్డులు అందుకున్నారు. ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్లుగా మురళీ శర్మ(అల వైకుంఠపురంలో), విజయశాంతి (సరిలేరు నీకెవ్వరు), ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్ఎస్ తమన్ (అల వైకుంఠపురంలో), ఉత్తమ విలన్‌గా సునీల్ (కలర్ ఫోటో), ఉత్తమ హాస్య నటులుగా వెన్నెల కిషోర్ (భీష్మ), ఉత్తమ గేయ రచయితగా రామ జోగయ్య శాస్త్రి (అల వైకుంఠపురంలో), ఉత్తమ గాయనీ గాయకులుగా మధుప్రియ (సరిలేరు నీకెవ్వరు), అర్మాన్ మాలిక్ (అల వైకుంఠపురంలో), ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా శేఖర్ మాస్టర్ (అల వైకుంఠపురంలో) పురస్కారాలు కైవసం చేసుకున్నారు.