- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మత్స్యకారుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
దిశ,నిజాంసాగర్: మత్స్యకారుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు అన్నారు. ఆయన సోమవారం నిజాంసాగర్ ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 100% సబ్సిడీతో చేప పిల్లలను చెరువులలో వదలడంతో..కార్మికులకు ఆర్థికంగా ఎదగడానికి వీలుంటుందన్నారు. గత ప్రభుత్వం బీద,బడుగు,బలహీన వర్గాల ప్రజలను దోచుకున్నారని ఆరోపణ చేశారు. నాసి రకం చేప పిల్లలను పంపిణీ చేసి మత్స్యకారులను మోసం చేయరాదని తెలిపారు. అదేవిదంగా అచంపేట్ గ్రామంలోని చేపల ఉత్పత్తి కేంద్రం పునః ప్రారంభించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పార్టీగా కాంగ్రెస్ పార్టీకి సముచిత స్థానం ఉందని అన్నారు. ప్రాజెక్టులో 24 లక్షల చేప పిల్లల విడుదల లక్ష్యం కాగా..సోమవారం 4 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం ఫిషరీష్ స్టేట్ ఫెడరేషన్ మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మత్స్య కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే మత్స్యకారులకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. మత్స్యకారులు చేప పిల్లలను కాపాడుకుని మంచి జీవనోపాధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏలే.మల్లికార్జున్, అనీష్ పటేల్,మల్లయ్య గారి ఆకాష్,రాము రాథోడ్,గజ్జల కిరణ్,గౌస్ పటేల్,చిట్యాల నారాయణ,సంకు లక్ష్మయ్య,జిల్లా మత్స్యకారుల అధికారి త్రిపతి,తహసిల్దార్ బిక్షపతి,ఎంపిడిఓ గంగాధర్, జిల్లా అధ్యక్షుడు గాదం సత్యనారాయణ,ప్రాజెక్టు మత్స్యకరుల అధ్యక్షుడు బొయి రాములు,తదితరులు పాల్గొన్నారు.