- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
31.15 కిలోమీటర్లు.. రూ.17.32 కోట్లతో రోడ్ల నిర్మాణం
దిశ, నల్లగొండ: ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన ఆరు రోడ్లకు, పాలనాపరమైన క్లియరెన్స్‌లు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన మూడో విడతలో యాదాద్రి జిల్లాలో రూ.17.32 కోట్ల వ్యయంతో 31.15 కిలోమీటర్ల మేర మోత్కూరు, ఆలేరు, చౌటుప్పల్, బీబీనగర్, పోచంపల్లి మండలాల్లో ఆరు రోడ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పాలనాపరమైన క్లియరెన్సులు జారీ చేసిందని, ఈ పథకంలో 60 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇప్పటికే రోడ్ల పనులకు అంచనాలు సమర్పించగా, టెండర్లు పిలిచి పనులు త్వరలో ప్రారంభించనున్నట్టు ఆ శాఖ ఈఈ జోగా రెడ్డి తెలిపారు.