- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేటి నుంచి ప్రత్యేక పాలన.. ముగిసిన వరంగల్ బల్దియా పాలకవర్గం పదవీకాలం
దిశ, వరంగల్ తూర్పు : వరంగల్ మహా నగరపాలక సంస్థ పాలక వర్గం పదవీకాలం ముగియడంతో సోమవారం నుంచి ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రత్యేక అధికారిగా అర్బన్ కలెకర్ట్ రాజీవ్‌గాంధీ హనుమంతును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఆయన ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో ఇప్పటివరకు అధికారంలో ఉన్న పాలకవర్గం మాజీలుగా మారనున్నారు.
మొదటి గ్రేటర్ పాలకవర్గం..
వరంగల్ మహా నగరపాలక సంస్థగా మారిన తర్వాత ఏర్పాటైన మొదటి పాలకవర్గం ఇదే. 2016 మార్చి 15 కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టారు. అదేరోజు మేయర్‌గా నన్నపునేని నరేందర్, డిప్యూటీ మేయర్‌గా ఖాజా సిరాజుద్దీన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నరేందర్ 34నెలల పాటు మేయర్‌గా విధులు నిర్వర్తించి ఎనిమిది పాలకవర్గ సమావేశాలను నిర్వహించారు. అనంతరం ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మేయర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్‌కు ఇన్‌చార్జి మేయర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆయన నాలుగు నెలల పాటు ఇన్‌చార్జిగా వ్యవహరించి మూడు పాలక వర్గ సమావేశాలు నిర్వహించారు. అనంతరం మేయర్‌గా గుండా ప్రకాశ్‌రావును నియమించారు. ఈయన కౌన్సిల్ ముగిసే వరకు 22 నెలలపాటు మేయర్‌గా బాధ్యతలు నిర్వహించి మొత్తం 20 సర్వసభ్య సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈయన పాలనలోనే బల్దియాలో పరుగులు పెట్టాయి. సుమారు రూ.90వేల కోట్ల పనులకు పాలకవర్గం అనుమతి ఇచ్చింది.
నెరవేరని మేయర్ కల..
బల్దియా కార్యాలయం వెనుక అత్యాధునికమైన కౌన్సిల్ సమావేశ మందిరాన్ని నిర్మించి అందులో చివరి సమావేశాన్ని నిర్వహించాలని మేయర్ గుండా ప్రకాశ్‌రావు కలగన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలోనే బహిరంగంగా వ్యక్తం చేశారు. పదవీకాలం ముగిసినప్పటికీ కౌన్సిల్ కార్యాలయం పూర్తి కాకపోవడంతో మేయర్, కార్పొరేటర్లు అసహనానికి గురయ్యారు. కనీసం కార్పొరేటర్ల అందరితో కూడిన శిలాఫలకం అయినా ఏర్పాటు చేయాలన్న విజ్క్షప్తి మేరకు దానిని ఏర్పాటు చేశారు.
నామినేషన్ పనులతో మచ్చ..
కార్పొరేటర్లు నామినేషన్ పనులను తమ సొంత ప్రయోజనాలకు వినియోగించుకున్నారన్న ఆరోపణలతో గతంలో నామినేషన్ పనులకు అధికారులు మంగళం పాడారు. మేయర్‌గా గుండా ప్రకాశ్ రావు అధికారంలోకి రాగానే నామినేషన్ పనులకు మళ్లీ అనుమతులు ఇచ్చారు. దీంతో కార్పొరేటర్లు ప్రజా ప్రయోజనాలకంటే నామినేషన్ పనులపైనే ఎక్కువ శ్రద్ధ చూపడంతో ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. ఇందులో ఎక్కడ ఎన్ని పనులు కార్పొరేటర్లు పూర్త చేశారో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడి మేయర్‌కు మచ్చగా మారింది.