స్తంభంపైనే ప్రాణాలొదిలిన… ఎలక్ట్రీషియన్

by Shyam |   ( Updated:2020-08-23 08:06:54.0  )
స్తంభంపైనే ప్రాణాలొదిలిన… ఎలక్ట్రీషియన్
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వికారాబాద్ మండల పరిధిలోని మైలార్ దేవరంపల్లి గ్రామంలోని ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… విద్యుత్ శాఖలో ప్రైయివేట్ పద్దతిన కుషారెడ్డి(26) ఎలక్ట్రిషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. లైన్మెన్ ఎల్‌సీ ఇచ్చామని చెప్పడంతో కుషారెడ్డి స్తంభం ఎక్కి విద్యుత్ మరమ్మతులు చేశారు. అయితే అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో ఆయన విద్యుత్ వైర్లపైనే పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

కుషారెడ్డి గత కొన్ని రోజులుగా అదే గ్రామంలో ప్రయివేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కుషారెడ్డి ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు ఆరోపించారు. ఆయన మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హుటాహుటిన గ్రామానికి చేరుకొని అధికారులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు.

Advertisement

Next Story