- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జూబ్లీహిల్స్ లో అక్రమంగా డ్రగ్స్ అమ్మకాలు..
by Sumithra |

X
దిశ జూబ్లీహిల్స్: జల్సాలకు అలవాటు పడిన ముగ్గురు యువకులు డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవీణ్ అనే స్నేహితుడి ద్వారా విశాఖ పట్నం నుంచి హాష్ ఆయిల్ ను కోనుగొలు చేశారు. అనుకున్నదే తడవుగా హైదరాబాద్ లో మంచి లాభాలకు అమ్మడం మొదలు పెట్టారు. నిందితులు ముగ్గురు 500ml వీడ్ /హష్ ఆయిల్ ను నలభై వేలకు కొనుగోలు చేసి 5ml కు మూడు వేలకు విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
విశ్వసనీయ సమాచారం మేరకు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురు యువకులను రెహ్మత్ నగర్ లో అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అప్పగించారు. నిందితుల పైన కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని సి.ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
Next Story