రైతుల ధాన్యంతో పరారైన లారీ డ్రైవర్

by Aamani |
రైతుల ధాన్యంతో పరారైన లారీ డ్రైవర్
X

దిశ, ఆదిలాబాద్: ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో రైతులు అమ్మేందుకు తీసుకువచ్చిన ధాన్యంతో లారీ డ్రైవర్ పరారైన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లాలోని న్యూముజిగి గ్రామంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం లారీలో నింపారు. అన్ లోడింగ్ కోసం బుధవారం ఆ లారీని రైస్ మిల్లుకు పంపారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఆ రైస్ మిల్లు వద్ద ఇంకా అన్ లోడ్ చేయాల్సిన లారీలు చాలానే నిలిచే ఉన్నాయి. దీన్ని అదునుగా భావించిన లారీ డ్రైవర్ ధాన్యంతో సహా పరారయ్యాడు. 12 మంది రైతులకు చెందిన ధాన్యం ఆ లారీలో ఉంది. అయితే అధికారులు ధాన్యం లారీకి జియో ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఆ లారీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ఘటన రైతు కుటుంబాలతో పాటు అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed