- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ ఉద్యోగుల విభజనను సీఎంలు పరిష్కరించాలి
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: చాలా కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదాన్ని తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చించుకొని పరిష్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఈఈజేఏసీ)డిమాండ్ చేసింది. లేదంటే ఏ ఒక్క ఆంధ్ర ఉద్యోగిని తెలంగాణ విద్యుత్ సంస్థల్లో చేరనీయబోమని, తరిమి కొడతామని హెచ్చరించింది. అవసరమైతే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో పోరాటానికి సిద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు టీఈఈ జేఏసీ ఒక తీర్మానం చేసిందని జేఏసీ ప్రతినిధులు శివాజీ, అంజయ్య, రామేశ్వరశెట్టి, గణేష్ రావు తదితరులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ ఉద్యోగుల విభజనకు వేసిన ధర్మాధికారి కమిటీ అధర్మాధికారి కమిటీగా వ్యవహరించి సుమారు 1000 మంది ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణకు కేటాయించిదని వారు విమర్శించారు.
Advertisement
Next Story