- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్‌బీఐ నిర్ణయంతో లాభాల జోరు
ముంబయి: ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహం ఇచ్చాయి. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సూచీలన్నీ లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 50 సూచీలు 1శాతానికి పైగా పెరిగింది. మదుపర్లు కొనుగోళ్లపై ఆసక్తి కనబర్చడంతో ఒకానొక దశలో సెన్సెక్స్ 558 పాయింట్లకు పైగా లాభపడగా, ఇంట్రాడేలో నిఫ్టీ 11,256.80 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 362 పాయింట్లు లాభపడి 38,025 వద్ద ముగిసింది. నిఫ్టీ 98 పాయింట్లు ఎగబాకి 11,200.15 వద్ద క్లోజయ్యింది.
ఆర్‌బీఐ విధాన కమిటీ నిర్ణయంతో నిఫ్టీ బ్యాంక్ సూచీలు 1.5శాతానికిపైగా లాభపడటం గమనార్హం. ప్రభుత్వరంగ బ్యాంకులు అత్యధికంగా 1.8శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 1.4శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్‌లోని 100 సూచీలు 0.4శాతం లాభపడి ముగిసాయి. నిఫ్టీలో టాటా స్టీల్ అత్యధిక లాభాలను పొందింది. ఆ కంపెనీ సూచీ ఏకంగా 3.8శాతం పెరిగి రూ.400.50కు చేరుకున్నది.
ఇన్ఫోసిస్, గెయిల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సూచీలు కూడా 2 నుంచి 3శాతం మధ్య లాభపడ్డాయి. ఈచర్ మోటార్స్, శ్రీ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెర్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 1,579 షేర్లు లాభపడగా, 1079 షేర్లు నష్టపోయాయి.