- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరి ప్రాణం తీసిన మొదటి శుభలేఖ
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లింటా విషాదం నెలకొంది. కూతురుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన తల్లిదండ్రులే కాటికి పయనమయ్యారు. పెళ్లి బాజా మోగాల్సిన వారింట్లో చావు మేళం మోగింది. కూతురు వివాహ మొదటి శుభలేఖను పెళ్లి కుమారుడి ఇంట్లో ఇచ్చి వస్తూ దంపతులు ఇద్దరూ మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో జరిగింది.
ఉదయగిరి మండలం వడ్లమూడిపల్లికి చెందిన గంగి శ్రీనివాసులరెడ్డి(48), వెంకటరత్నమ్మ(40) భార్యాభర్తలు. వారికి ఇద్దరు కూతుళ్లు సంతానం. పెద్దకూతురికి వరికుంటపాడు మండలం ఆండ్రావారిపల్లికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయం చేశారు. వచ్చే నెల 7వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా వివాహ పత్రికలు అచ్చువేయించారు. మొదటి పత్రిక వరుడి ఇంట్లో ఇచ్చేందుకు దంపతులు బైక్‌పై వెళ్లారు. వరుడి కుటుంబంతో పాటు బంధువులకు పెళ్లి కార్డులు ఇచ్చి తిరిగి ప్రయాణామయ్యారు. జడదేవి – తెడ్డుపాడు గ్రామాల మధ్యకు సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ని ప్రమాదవశాత్తూ వెనక నుంచి ఢీకొట్టారు. బైక్‌పై నుంచి రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్రగాయాలు కావడంతో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కూతురి పెళ్లి చేసే ఆనందంలో ఉన్న కుటుంబంలో ఈ ఘటనతో తీవ్ర విషాదం నెలకొంది.