- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్‌తో దేశం ఇంకా కొట్టుమిట్టాడుతోంది : ఉప రాష్ర్టపతి
దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ మహమ్మారితో దేశం ఇంకా కొట్టుమిట్టాడుతున్నదని ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాండమిక్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్యరంగంలో మరింత సమూలమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రూపొందించిన కొవిడ్ 19 ప్రొటోకాల్ బుక్‌ను ఆయన సోమవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో స్పష్టమైన ట్రీట్మెంట్ ప్రొటోకాల్‌ను పుస్తకం రూపంలో తయారు చేసిన ఏఐజీ హాస్పిటల్‌ను అభినందిస్తున్నానని చెప్పారు. ఈ పుస్తకం కొత్తగా చికిత్స అందించే డాక్టర్లకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ హాస్పిటల్‌లో చికిత్స పొందిన రోగులు కోలుకున్న తీరు, ఆరోగ్య పరిస్థితులను గమనంలోకి తీసుకొని బుక్‌ను తయారు చేయడం జరిగిందన్నారు. 25 ఏఐజీ క్లినిక్‌లలోని ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ విభాగాల్లో చికిత్స పొందిన 25 వేల మంది పేషెంట్ల ఫలితాల ప్రకారం దీన్ని తయారు చేశామన్నారు. దేశ వ్యాప్తంగా కొవిడ్ రోగులకు చికిత్సను అందించే డాక్టర్లకు సుమారు లక్ష కాఫీలను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. దీంతో దేశ వ్యాప్తంగా కొవిడ్ పేషెంట్లకు సకాలంలో సరైన చికిత్స అందుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ జీవి రావు మాట్లాడుతూ… కొవిడ్ 19 కు వివిధ రకాల చికిత్సను అందించడం వలన పేషెంట్లకు నష్టం జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. దీంతో మెజార్టీ పేషెంట్లు రికవరీ అయిన మెడిసిన్స్‌నే ఈ ప్రొటోకాల్ లో చేర్చడం జరిగిందన్నారు.