పది తర్వాత బయటకు వచ్చిన వారిని చితకబాదిన పోలీసులు

by Aamani |
పది తర్వాత బయటకు వచ్చిన వారిని చితకబాదిన పోలీసులు
X

దిశ, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శనివారం రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ ఆకస్మిక తనిఖీలు చేశారు. మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎసీపీ అఖిల్ మహాజన్తో కలిసి 10 గంటల తర్వాత బయట తిరుగుతున్న వాహనదారులను ఆపి లాక్ డౌన్ సమయం లో బయటకు రావాల్సిన అవసరాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మెడికల్ ఎమర్జెన్సీ, పోలీస్ పాస్ ఉన్న వాహనాలు వదిలేసి, అనవసరంగా తిరుగుతున్న ఆకతాయిల వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కు 95 శాతం మంది ప్రజలు సహకరిస్తున్నారన్నారు. కొంతమంది ఆకతాయిలు మెడికల్ బిల్లు తీసుకొని తిరుగుతున్నారని, వారి పట్ల చాలా కఠినంగా ఉంటున్నట్లు తెలిపారు. అవసరమైతే వారి వాహనాలు సీజ్ చేసి, కేసు నమోదు చేయడం కూడా జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఎవరు బయటకు వచ్చినా వారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకొని అవసరమైతే ఐసోలేషన్ కు పంపించడం జరుగుతుందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed