- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సిద్దిపేట మహిళలకు గుడ్‌న్యూస్.. ఆ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 8వ తేదీ వరకు గడువు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో 22 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 9 మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు, 95 ఆయా పోస్టులు ఉన్నాయని తెలిపారు. దరఖాస్తు దారులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, అంతేగాకుండా.. స్థానిక గ్రామస్తులే అప్లై చేయాలన్నారు. అభ్యర్థుల వయస్సు జూలై 1, 2021 నాటికి 21 నుండి 35 ఏళ్లు మించకుండా ఉండాలని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస వయస్సు 18 ఏళ్లు. అభ్యర్థులు పదో తరగతి మెమో, కుల ధృవీకరణ పత్రం, స్థానిక నివాస ధ్రువీకరణ పత్రములు, దరఖాస్తుదారు దివ్యాంగులు, అనాథ, వితంతువు అయితే సంబంధిత ధ్రువీకరణ పత్రములు గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరించి వెబ్ సైట్‌లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://mis.tgwdcw.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు అన్నారు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. దరఖాస్తు సమర్పించు తేదీ ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.