వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగులు

by Sridhar Babu |   ( Updated:2021-09-30 07:32:29.0  )
old-women
X

దిశ,పాలేరు: కూసుమంచి మండల పరిధిలోని చిన్న పోచారం గ్రామానికి చెందిన రామ సహాయం వసుమతి(75)అనే వృద్ధురాలి మెడలోని గొలుసును గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్లారు. బుధవారం పోచారం గ్రామానికి చెందిన వృద్ధురాలి ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి కరోనా టీకా వేసుకున్నావా? అని అడుగగా తాను రెండు డోసులు వేసుకున్నానని చెప్పినట్లు తెలిపింది. దీనితో మళ్ళీ మరుసటిరోజు వచ్చిన ఆ వ్యక్తులు ఆమెతో ప్రభుత్వం నుండి 70 సంవత్సరాలు దాటిన మీకు కరోనా పెన్షన్ వస్తుందంటూ నమ్మించారు. గురువారం మధ్యాహ్నం సమయంలో ఆమె ఇంటి వద్ద గోడకు నిలబెట్టి ఫోటోలు తీశారు. అదే క్రమంలో నోటికి ప్లాస్టర్ వేశారు.

వెంటనే మెడలోని మూడు తులాల బంగారు పుస్తెల తాడును బలంగా లాక్కొని వెళ్ళారని తెలిపింది. 20 అడుగుల దూరంలో బండి పై ఉన్న వ్యక్తి ఇద్దరూ కలిసి పారిపోయారని పోలీసులకు చెప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సిఐ సతీష్ పరివేక్షణలో ట్రైనీ ఎస్సై విజయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story