విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే హక్కు కేంద్రానికి లేదు: మేధాపాట్కర్

by srinivas |
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే హక్కు కేంద్రానికి లేదు: మేధాపాట్కర్
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే హక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని ప్రముఖ సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ అన్నారు. విశాఖలో స్టీల్ ప్లాంటు ప్రవేటీకరణ వ్యతిరేకంగా కూర్శన్నపాలెం దగ్గర కార్మికులు చేపట్టిన దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. ఐఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షులు డా.అపర్ణతో కలిసి మేధాపాట్కర్ శనివారం కార్మికులకు మద్దతు ప్రకటించారు. అనంతరం మేధా పాట్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఈ దేశాన్ని ప్రజలే నిర్మించుకున్నారని మేధాపాట్కర్ చెప్పుకొచ్చారు. ప్రజలు నిర్మించుకున్న ఈ దేశాన్ని మోదీ ప్రభుత్వం కొందరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.ఈ పోరాటంలో ప్రజలు, కార్మికులు, రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మేధాపాట్కర్ పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్‌తో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలతో కలిసి తామంతా ఉద్యమిస్తామని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తామంతా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రముఖ సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ కార్మికులకు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed