ఎమ్మెల్యే ‘చెన్నమనేని’ భారతీయుడు కాదు : కేంద్రం

by Shyam |
Vemulawada MLA Chennamaneni Ramesh
X

దిశ, తెలంగాణ బ్యూరో: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారం మరో మలుపు తిరిగింది. కేంద్ర ప్రభుత్వం తొలి నుంచీ చెప్తున్నట్లుగానే అతను జర్మనీ పౌరుడేనని, ఆ దేశ పౌరసత్వం ఉందని తెలంగాణ హైకోర్టుకు మంగళవారం వెల్లడించింది. కానీ జర్మనీ రాయబార కార్యాలయం మాత్రం తమ దేశ పౌరుడు కాదని, పౌరసత్వం లేదని, పాస్‌పోర్టు మాత్రం ఉందని, అది పాతది కాబట్టి దాన్ని ఇప్పటికీ ఉపయోగించుకోవచ్చునని వివరించింది.

తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కేంద్ర ప్రభుత్వం చెన్నమనేని రమేశ్ పౌరసత్వం విషయంలో నిర్ణయం తీసుకున్నదని, కౌంటర్ దాఖలు చేయడానికి నెల రోజుల గడువు ఇవ్వాలని అదనపు అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తి చేశారు. వారం రోజుల గడువు సరిపోతుందని, కోర్టు కోరిన అన్ని రికార్డులను సమర్పించామని అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు. వీలైనంత తొందరగా తేల్చాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. అన్ని వైపులా వాదనలు విన్న హైకోర్టు బెంచ్ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

అయితే తాను 1993లో జర్మనీకి వెళ్లి అక్కడి పౌరసత్వం తీసుకున్నప్పుడే తాను భారత పౌరసత్వాన్ని కోల్పోయానని, తిరిగి 2009లో తాను స్వచ్ఛందంగా ఇండియాకు వచ్చి భారత పౌరసత్వం తీసుకోవడంతోనే జర్మనీ పౌరసత్వాన్ని కోల్పోయానని అఫిడవిట్‌లో చెన్నమనేని వివరించారు.అన్ని వైపుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం కూడా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed