- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడ్చల్‌కు మర్కజ్ మకిలీ
దిశ, మేడ్చల్: మేడ్చల్ జిల్లా నుంచి సుమారు 50 మందికిపైగా ఆ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే కొంతమంది అక్కడే ఉండిపోయారు. మరికొంతమంది ఇక్కడికి వచ్చారు. వారితో ఇప్పుడు కలవరం నెలకొన్నది. దీంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఆ విషయమేంటో మీరే తెలుసుకోండి..
మేడ్చల్ జిల్లాకు మర్కజ్ మకిలీ అంటింది. ఒక్క మేడ్చల్ జిల్లా పరిధిలోనే 50 మందికి పైగా ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన మతపరమైన సమావేశాలకు వెళ్లొచ్చినట్టు తెలుస్తోంది. దీంతో జిల్లావాసుల్లో కలవరం మొదలయ్యింది. అందులోని ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచే 40 మందికి పైగా ఢిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనలకు వెళ్లొచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే 50 మందికి పైగా ఢిల్లీ వెళ్లొచ్చినవారిని గుర్తించగా, అనధికారికంగా మరికొంతమంది ఉంటారన్నది సమాచారం. తాజాగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి కేసులు బయటపడుతుండడంతో మేడ్చల్ జిల్లా పరిధిలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఢిల్లీ వెళ్లిన వచ్చి వారంతా దాదాపు రెండు వారాలకుపైగానే ప్రజల మధ్య కలిసి తిరిగారు. దీంతో ఎవరికి కరోనా వైరస్ సోకిందోనని జిల్లావాసులు కలవరపడుతున్నారు. వాస్తవానికి వీరంతా మార్చి 15 నుంచి 17 వరకు జరిగిన మర్కజ్ సమావేశాలకు మార్చి 13 తేదీ నుంచే వెళ్లారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి మత పెద్దలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అయితే పలు కారణాలతో చాలామంది 21వ తేదీ వరకు ఢిల్లీలోనే ఉండిపోయారు. అనంతరం లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం మర్కజ్ పేరే మేడ్చల్ జిల్లాలో మారుమోగుతోంది. ప్రధానంగా కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో ఈ మతపరమైన సమావేశాలకు వెళ్లొచ్చినట్టు తెలుస్తోంది.
కీసరలోనూ మర్కజ్ అలజడి..
ఢిల్లీ నిజాముద్దీన్‌లో నిర్వహించిన మత ప్రార్థనలకు కీసర మండలం నుంచి సైతం ఇద్దరు వెళ్లొచ్చారు. అయితే ఈ ఇద్దరినీ అధికారులు గుర్తించి పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. పరీక్షల్లో వారిద్దరికి నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారిని తిరిగి ఇంటికి పంపారు. దీనికితోడు జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 52 ఏళ్ల వ్యక్తి కూడా మతపరమైన సమావేశాలకు వెళ్లినట్టు గుర్తించి, అతనికి పరీక్షలు నిర్వహించారు. అతనికి కూడా కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే మేడ్చల్ మండలానికి సంబంధించి మరో ఇద్దరు మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిని అధికారులు గుర్తించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారికి సంబంధించిన శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది.
అధికార యంత్రాంగం పర్యటన..
ఢిల్లీలోని మతపరమైన ప్రార్థనలకు జిల్లా నుంచి వెళ్లినవారిలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన వారే అధికంగా ఉండడం గమనార్హం. ఒక్క ఈ నియోజకవర్గం నుంచే 40 మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లారు. అయితే అధికారులు ఇప్పటివరకు ఢిల్లీ వెళ్లొచ్చిన వారిని గుర్తించగా, 17 మంది ఢిల్లీలోనే ఉండిపోయారు. మిగిలినవారి ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లా వైద్యాధికారి వీరాంజనేయులు, ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి నియోజకవర్గంలోని గాజులరామారం, రోడామిస్త్రీనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలెవరూ బయటకు రాకుండా 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
ఢిల్లీ వెళ్లొచ్చినవారు ఎవరైనా ఉంటే.. స్వచ్ఛందంగా ముందుకు రావాలని అధికార యంత్రాంగం కోరుతోంది. ఢిల్లీ వెళ్లివచ్చిన వారి ఆచూకీ కనుక్కునేందుకు అధికారులు ముచ్చెమటలు పడుతున్నాయనే చెప్పాలి. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లినవారిలో కొంతమంది విమానాల్లో, మరికొంతమంది రైళ్లలో వెళ్లగా, ఇంకొంతమంది ప్రైవేటు వాహనాల్లో వెళ్లారు. ఇప్పటికే విమానయానం, రైల్వే శాఖ నుంచి కొంతమంది వివరాలను సేకరించగలిగారు. అందులో ఉన్న ఫోన్ నంబర్లకు కాల్ చేస్తే ఎవరూ స్పందించకపోవడంతో అధికారులకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఇక ప్రైవేటు వాహనాల్లో వెళ్లొచ్చినవారిని పట్టుకునేందుకు అధికారులు తెగ ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా ఇందులో ఎంతమందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణగా తేలుతుందోననేది చర్చనీయాంశంగా మారింది.
Tags: medchal, corona, muslims, officers, mla’s