- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ నుంచి థర్డ్ డోసు
లండన్: తమ పౌరులకు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. శీతాకాలం కన్నా ముందే కరోనా కొత్త వేరియంట్లకు వ్యతిరేకంగా తమ పౌరులకు రక్షణ కల్పించేందుకుగాను వ్యాక్సిన్ థర్డ్ డోసు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్ఎస్) పచ్చ జెండా ఊపింది. దీనిపై హెల్త్ అండ్ సోషల్ కేర్ సెక్రటరీ జావెద్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ నుంచి వేగంగా బూస్టర్ వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు మంత్రులు ఎన్‌హెచ్ఎస్‌తో కలిసి పనిచేస్తున్నారు’అని అన్నారు. కాగా వ్యాక్సిన్, ఇమ్యునైజేషన్ జాయింట్ కమిటీ (జెసివిఐ) సలహా మేరకు ఈ ప్రణాళికను రూపొందించామని ఆరోగ్యశాఖ తెలిపింది. వార్షిక ఫ్లూ వ్యాక్సిన్ కార్యక్రమంతో పాటు బూస్టర్ డోసు కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పింది.