గుండె జబ్బుతో బాలుడు మృతి

by Sumithra |
గుండె జబ్బుతో బాలుడు మృతి
X

దిశ, బయ్యారం : చిరు ప్రాయం నుంచే గుండెజబ్బుతో బాధపడుతున్న ఓ బాలుడు మృతి చెందిన సంఘటన గార్ల మండలంలో చోటుచేసుకుంది. శనివారం కుటుంబీకుల, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్లూరు గ్రామ పంచాయతీలోని దేశ్య తండా గ్రామానికి చెందిన అజ్మీరా సామ్యూల్ రాజు (11) చిన్నతనము నుంచి గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. పుల్లూరు ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి అభ్యసిస్తున్న సామ్యూల్ రాజు, మధ్యాహ్న భోజనం తదుపరి అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. దీంతో హుటాహుటిన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి బాలుడు మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు నిర్ధారించారు. దీనితో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది.

Advertisement

Next Story