ఆన్‌లైన్‌ క్లాస్ జరుగుతుండగా.. దారుణానికి ఒడిగట్టిన బాలుడు

by Sumithra |   ( Updated:2021-06-28 02:23:57.0  )
Student-Suicide
X

దిశ, కూకట్‌పల్లి : ఆన్‌లైన్ క్లాస్‌లో కూర్చున్న 12 ఏండ్ల చిన్నారి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సంగీత నగర్ కాలనీలో నివాసముంటున్న ఆనంద్, లక్ష్మి దంపతులకు బాల పరుశురాం(18), మణికంఠ(12) ఇద్దరు కొడుకులున్నారు.

ఆనంద్.. హోండా షోరూంలో పని చేస్తుండగా.. చిన్న కొడుకు మణికంఠ.. రావుస్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రోజు వెళ్లినట్టుగానే ఆనంద్, పరుశురాం, తల్లి లక్ష్మి పనికి వెళ్ళారు. ఇదిలా ఉండగా.. మణికంఠ శనివారం ఇంట్లో ఆన్‌లైన్ క్లాస్ వింటూ.. ఫ్కాన్‌ హుక్కుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చిన ఆనంద్‌కు.. మణికంఠ ఇంట్లోని ఫ్యాన్ హుక్కుకు చున్నీతో ఉరివేసుకుని కనిపించాడు.

వెంటనే స్థానికుల సహాయంతో మణికంఠను రాందేవ్ రావు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మణికంఠ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా మణికంఠకు పబ్జీ గేమ్ అలవాటు ఉన్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రిలో వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed