- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా ఫిట్‌నెస్ క్రెడిట్ అతనికే ఇస్తా : కొహ్లీ
క్రికెట్‌ను సీరియస్‌గా ఫాలో అయ్యే వారికి ఆశ్చర్యపరిచే విషయం టీమిండియా సారథి విరాట్ కొహ్లీ ఫిట్‌నెస్. అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించినప్పుడు చూసిన కొహ్లీకి.. ఇప్పటి కొహ్లీకి ఎంతో తేడా కనపడుతుంది. ఆట పరంగా ఎంత మెరుగయ్యాడో.. అతని ఫిట్‌నెస్ అంతకు మించి మెరుగయ్యిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇదే విషయం విరాట్ కొహ్లీ కూడా అంటున్నాడు. నాకు ఫిట్‌నెస్‌పై శ్రద్ద కలిగేలా చేసి.. జట్టులో అత్యంత ఫిట్‌గా ఉన్న వ్యక్తిగా తయారు చేసిన ఘనత శంకర్ బసుదే అని చెప్పాడు. 2015 నుంచి 2019 వరకు భారత క్రికెట్ జట్టుకు శంకర్ బసు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా పని చేశాడు. బసు అంతకు మునుపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ట్రైనర్‌గా కూడా పని చేశాడు. అప్పుడే కొహ్లీకి పరిచయం. ఫిట్‌నెస్ అంటే రన్నింగ్, మరికొన్ని వ్యాయామాలు అని భావించిన కొహ్లీకి అతనే వెయిట్ లిఫ్టింగ్ కూడా పరిచయం చేశాడు. 2015లో టీమిండియా ఫిట్‌నెస్ కోచ్‌గా వచ్చాక.. వీరిద్దరి మధ్య స్నేహం మరింత పెరిగింది. అప్పటి నుంచే కొహ్లీ శరీర పటిష్టతలో ఎంతో పరివర్తన కనపడింది. ‘నా ప్రస్తుత ఫిట్‌నెస్ క్రెడిట్‌ను నేను తీసుకోను. అది శంకర్ బసు ఘనతే. నా కెరీర్‌లో ఫిట్‌నెస్ పరివర్తన 2015 నుంచి మొదలైంది. దానికి మరో స్థాయికి తీసుకెళ్లడంలో శంకర్ పాత్ర మరువలేను’ అని కొహ్లీ చెప్పాడు. నా కెరీర్‌లో నడుం నొప్పి సమస్యలు వెంటాడాయి. అప్పుడే శంకర్ నాకు లిఫ్టింగ్ పరిచయం చేశాడు. సమస్య పెద్దది అవుతుందని సంశయించాను. కానీ అతను చాలా వెరైటీగా నాతో చేయించాడు. మూడు వారాల తర్వాత అమోఘమైన మార్పును నేను గమనించాను అని కొహ్లీ అన్నాడు. కేవలం వ్యాయామాలే కాకుండా నా డైట్‌లో కూడా మార్పులు చేశాడు. దీంతో ఆయన సూచనలన్నీ పాటిస్తూ వచ్చాను. ఫిట్‌గా ఉంటేనే దేశం కోసం మరిన్ని రోజులు ఆట ఆడొచ్చనే విషయాన్ని తెలుసుకొని చాలా శ్రమించాను అని కొహ్లీ చెప్పాడు.