సమీపిస్తున్న హైకోర్టు డెడ్ లైన్… పుంజుకోని వేగం

by Shyam |   ( Updated:2021-10-03 22:10:19.0  )
Covid-19 vaccine wastage:
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్​ చాలా స్లోగా నడుస్తున్నది. ప్రతీ రోజు సగటున రెండున్నర లక్షల డోసులను మాత్రమే అందజేస్తున్నారు. పంపిణీలో వేగం పెంచాలని ఇటీవలే హైకోర్టు సూచించిన విషయాన్నీ అధికారులు మరచిపోయారు. దీంతో కోర్టు విధించిన డెడ్​లైన్​ కు టీకా పంపిణీ పూర్తి చేస్తామో? లేదోనని అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. అనుకున్న సమయానికి పూర్తి కావడం కష్టమేనని స్వయంగా అధికారులే ఆఫ్​ ది రికార్డులో ఒప్పుకుంటున్నారు. టీకాల లభ్యత పుష్కలంగా ఉన్నా, అధికారుల మధ్య సమన్వయం లేకనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఉన్నతాధికారులు చెప్పడం కొసమెరుపు. ఇదే అంశంపై ఇటీవల జరిగిన వైద్యారోగ్యశాఖ హెచ్​ఓడీల మీటింగ్​ లోనూ సీఎస్​ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కానీ ఇప్పటికీ రోజు వారి పంపిణీ సంఖ్య పెరగడం లేదు. ఇదే విధానంలోనే పంపిణీ కొనసాగితే హైకోర్టు విధించిన సమాయానికి టీకా పంపిణీ పూర్తికాదని కింది స్థాయి సిబ్బంది చర్చించుకుంటున్నారు.

71 లక్షల మందికే రెండు డోసులు..

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 71,32,703 మంది మాత్రమే రెండు డోసులు తీసుకున్నారు. మన రాష్ట్రంలోనే వ్యాక్సినేషన్​ స్పీడప్​ లో ఉన్నదని చెబుతున్న సర్కార్​మాటలకు, వైద్యారోగ్యశాఖ విడుదల చేస్తున్న లెక్కలకు పొంతన లేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర చాలా స్లోగా నడుస్తున్నట్లు స్పష్టంగా అర్ధమవుతున్నది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 2.86 కోట్ల మంది టీకాకు అర్హులు ఉండగా, 1,88,55,151 మంది సింగల్​ డోసులు పొందారు. అంటే సుమారు మరో కోటి మందికి కోర్టు విధించిన గడువు లోపు డోసులు పంపిణీ చేయాలి. అంటే వీరందరికీ కనీసం సింగల్​ డోసుతో వ్యాక్సినేషన్​ను పూర్తి చేయాలన్నా 5 నుంచి 6 నెలల సమయం పట్టొచ్చని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు.

గరిష్ఠంగా 4 నుంచి 5 లక్షలే…

మన దగ్గర ఇప్పటి వరకు అతి కష్టం మీద గరిష్ఠంగా 4 నుంచి 5 లక్షల మందికి వ్యాక్సిన్​ ను పంపిణీ చేస్తున్నారు. ఇదీ గ్రామీణ స్థాయిలో ఉండే ఆశాలు, ఏఎన్​ఎంలు ఇంటింటికి తిరిగి, పొలాల్లో వెళ్లి మరీ డోసులు ఇస్తేనే ఈ స్థాయిలో జరిగింది. కానీ గత రెండు మూడు రోజుల నుంచి కేవలం సగటున మూడు లక్షల మందికి మాత్రమే టీకాలు ఇస్తున్నారు. దీంతో ఈ స్పీడ్​తో వెళ్తే కోర్టు విధించిన గడువు సరిపోదని ఆఫీసర్లు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed