తాలిబన్ల రాకెట్ దాడులు.. ఆప్ఘన్‌లో హోరా హోరీ పోరాటాలు

by vinod kumar |
Afghan
X

కాబూల్ : ఆఫ్ఘాన్‌లో తాలిబన్ల దాడులు రోజు రోజుకి ఉధృతమవుతున్నాయి. ఇప్పటికే కీలక భూభాగాలను తమ హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. తాజాగా కాందహర్ ఎయిర్ పోర్ట్‌పై రాకెట్ దాడులు చేశారు. ఆదివారం రాత్రి కాందహర్ ఎయిర్ పోర్ట్‌పై మూడు రాకెట్లు దూసుకొచ్చాయని ఎయిర్ పోర్ట్ చీఫ్ పస్తూన్ తెలిపారు. ఈ దాడితో అన్ని విమాన రాకపోకలను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.

అయితే దాడిలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదని తెలుస్తోంది. ఈ దాడిని ఆప్ఘన్ భద్రతాధికారులు కూడా ధ్రువీకరించారు. తాలిబన్లను ఎదుర్కోవడానికి అవసరమయ్యే అన్ని ఆయుధాలు ఆప్ఘన్ దళాలకు ఇక్కడి నుంచే వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రస్తుత దాడి జరిగినట్లు అనుమానాలున్నాయని తెలిపారు. అయితే, దీనిపై తాలిబన్లు ఎటువంటి ప్రకటన చేయలేదు.

తాలిబన్లకు భారీ ఎదురు దెబ్బ..

కాందహర్ ఎయిర్ పోర్ట్‌పై దాడి చేసిన తరువాత ఆప్ఘన్ దళాలు చేసిన వైమానిక దాడిలో వందల సంఖ్యలో తాలిబన్లు హతమయ్యారని తెలుస్తోంది. కాందహర్ ప్రావిన్స్‌లోని జెహరాయ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుత దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 250 మందికి పైగా తాలిబన్లు మరణించారని, వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఆప్ఘన్ ఆర్మీ తెలిపింది. అయితే కొన్ని ప్రాంతాలను తాలిబన్లు నిన్న కూడా స్వాధీనం చేసుకున్నారని టోలోన్యూస్ వెల్లడించింది. ముఖ్యంగా కాందహర్ ప్రావిన్స్‌లో రెండు వర్గాలు హోరాహోరి పోరాటం సాగిస్తున్నాయని స్థానిక పత్రికలు స్పష్టం చేశాయి.

Advertisement

Next Story

Most Viewed