- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ మాఫియా అరెస్ట్.. 2 కోట్ల విలువైన మెఫిడ్రైన్ స్వాధీనం
దిశ, కుత్బుల్లాపూర్ : డ్రగ్స్ మాఫియాను మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా ప్రొహిబిషన్ ఆండ్రాయిడ్ ఎక్సైజ్ అధికారి కె.విజయ్ భాస్కర్ కు సమాచారం అందడంతో కూకట్ పల్లి ఎస్వీ సెలక్షన్ అపార్టుమెంట్ లో దాడులు చేశారు. దాడుల్లో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారవు పల్లికి చెందిన చిటుకూరి ప్రశాంత్ రెడ్డి(24) అనే కారు డ్రైవర్ 9 గ్రాముల మెఫెడ్రోన్ తో పట్టుబడ్డాడు. అతడిని విచారించగా సదరు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మహేష్ కన్నారెడ్డి పేరు చెప్పగా బొంగళూర్ గేట్ వద్ద లాడ్జి లో 921 గ్రాముల డ్రగ్స్ తో దొరికాడు.
అతని సమాచారంతో నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట్ మండలం బావజీపల్లి గ్రామానికి చెందిన కొండనూరి రామకృష్ణ గౌడ్ ను అదుపులోకి తీసుకోగా అతని వద్ద 4 కిలోల డ్రగ్స్ , ఫోర్డ్ కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.2 కోట్లు ఉండవచ్చని అధికారులు తెలిపారు. వీరికి బంధం హన్మంత్ రెడ్డి, సురేష్ రెడ్డి లు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరిని అదుపులోకి తీసుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.