తమన్ మరో మ్యూజికల్ రికార్డ్

by Shyam |   ( Updated:2020-03-03 05:11:11.0  )
తమన్ మరో మ్యూజికల్ రికార్డ్
X

ఎస్.ఎస్. తమన్ టాలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అంతకు ముందున్న రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ప్లేస్‌ను కొట్టేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమా ఆల్బమ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. యూట్యూబ్‌లోను అత్యధిక వ్యూస్ పొందిన అల్బమ్‌గా రికార్డ్ క్రియేట్ చేసిన AVP… జియో సావన్‌లోనూ 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకులు థమన్‌కు అప్రిసియేషన్ అవార్డు ఇచ్చింది జియో సావన్.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన తమన్… ఈ అవార్డును డైరెక్టర్ త్రివిక్రమ్ చేతుల మీదుగా అందుకోవడం మరింత సంతోషంగా ఉందని తెలిపాడు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్‌లో ఈ అవార్డు అందుకున్న ఫస్ట్ మ్యుజిషియన్ తమన్ కాగా… దీనంతటికి ప్రధాన కారణం త్రివిక్రమే అంటూ ధన్యవాదాలు చెప్పాడు. త్రివిక్రమ్ లేకపోతే ఈ అచీవ్‌మెంట్ సాధ్యమయ్యేదే కాదన్నాడు తమన్.

Advertisement

Next Story