- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం?
న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసినట్టు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ మంగళవారం వెల్లడించింది. సరయి కాలే ఖాన్ ఏరియాలో సోమవారం రాత్రి ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నామని తెలిపింది. జమ్ము కశ్మీర్‌కు చెందిన ఈ ఇద్దరు ఢిల్లీలో తలదాచుకుంటున్నట్టు తమకు సమాచారం అందిందని, వారిని పట్టుకోవడానికి మిలినయం పార్క్ దగ్గర మాటువేశామని డీసీపీ(ప్రత్యేక విభాగం) సంజీవ్ యాదవ్ చెప్పారు.
బారాముల్లా జిల్లాకు చెందిన అబ్దుల్ లతీఫ్ మీర్(22), కుప్వారా జిల్లాకు చెందిన మొహమ్మద్ అశ్రఫ్ ఖాటనా(20)లను తమ బృందం సోమవారం రాత్రి సుమారు 10.15 గంటల ప్రాంతంలో అరెస్టు చేసిందని వివరించారు. వీరి దగ్గరి నుంచి రెండు సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, పది లైవ్ కార్ట్‌రిడ్జెస్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీరిరువురు గతంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లాలని ప్రయత్నించగా, ఆర్మీ నిలువరించిందని కొన్నివర్గాలు తెలిపాయి. తాజాగా, ఢిల్లీలో దాడి చేసి నేపాల్ మీదుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ చేరాలన్నదే వారి ప్లాన్ అని వివరించాయి.