- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనకాపల్లిలో ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలి..
X
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖపట్నం జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ వాహనాలపై కూలిపోవడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. జిల్లాలోని అనకాపల్లి జాతీయ రహదారిపై.. హైవే విస్తరణ కోసం నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బీమ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలో బీమ్ రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై పడిపోయింది.
ఈ ప్రమాదంలో రెండు కార్లు, ఓ లారీ ధ్వంసం కాగా.. ఇద్దరు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీమ్ విరిగిపడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో నాణ్యత లోపించడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంతోపాటు ఫ్లై ఓవర్ కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Next Story