సోషల్ మీడియాలో పోస్ట్ వల్ల కర్ణాటకలో ఉద్రిక్తత

by Anukaran |
సోషల్ మీడియాలో పోస్ట్ వల్ల కర్ణాటకలో ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వల్ల కర్ణాటకలోని ఓ ప్రాంతంలో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. డీజీ హళ్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. ఆందోళనకారులు ఎమ్మెల్యే ఇంటి మీదకు రాళ్లు రువ్వారు. ఎమ్మెల్యే అల్లుడు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టి ఓ వర్గాన్ని కించపరిచారంటూ ఆందోళనకరాలు నిరసన వ్యక్తం చేశారు.

ఆందోళనకారుల రాళ్లదాడిలో ఏసీపీ సహా 60 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. 110 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. డి.జె. హళ్లి, కె.జి. హళ్లిలో 144 సెక్షన్ ను విధించారు. అదేవిధంగా వివాదాస్పద పోస్టులు పెట్టిన ఎమ్మెల్యే అల్లుడు నవీన్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story