- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మానుకోటలో టెన్షన్..టెన్షన్.. బీజేపీ నాయకుల హౌస్ అరెస్టు..
దిశ,మహబూబాబాద్ : ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల సరళి పరిశీలనలో భాగంగా నెల్లికుదుర్ మండలానికి చేరుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్‌లపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. అనంతరం ప్రేమేందర్ రెడ్డిని ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, హుస్సేన్ నాయక్‌ను మాహబూబాబాద్‌కు తరలించారు. దాడి నేపథ్యంలో ఈరోజు సుమారు100 మందికి బీజేపి నాయకులును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పూర్తిగా పోలీసుల పహారాతో నిండిపోయింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ నేతల, కార్యకర్తల కదలికలను పోలీసులు గమనిస్తూ.. ఏదైనా ప్రతి చర్యకు దిగుతారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ బీజేపీ శ్రేణులు.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ దిష్టి బొమ్మను దహనం చేసి.. కేసముద్రం, నెల్లికుదుర్ మండలాల్లో రాస్తారోకో నిర్వహించారు. ఇరువర్గాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతోందో.. అని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.