జనగామలో పది కరోనా కేసులు

by Shyam |
జనగామలో పది కరోనా కేసులు
X

దిశ, జనగామ: జనగామ జిల్లాలో పది కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు డీఎంహెచ్‌ఓ డాక్టర్ మహేందర్ శనివారం వెల్లడించారు. వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న సిబ్బందితో పాటు జిల్లా కేంద్రంలోని వ్యక్తులకు రాపిడ్ టెస్ట్ ద్వారా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించామన్నారు. కరోనా వైరస్ ఉన్న వారు హోంక్వారంటైన్లో ఉండాలని ఆదేశించినట్టు తెలిపారు. కాగా జిల్లాలో ఇప్పటివరకూ 174 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 106 మంది డిశ్చార్జి అయ్యారని, 68 మంది యాక్టివ్‌గా ఉన్నారన్నారు. ఇందులో ఇప్పటివరకూ 7 గురు వ్యక్తులు మృతి చెందినట్టు స్పష్టం చేశారు. దీంతో అందరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రతిఒక్కరూ మొహానికి మాస్క్ ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.

Advertisement

Next Story