Zomato: ఎర్త్‌డే స్పెషల్.. కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టిన జొమాటో

by Nagaya |   ( Updated:2022-10-29 03:38:32.0  )
Zomato: ఎర్త్‌డే స్పెషల్.. కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టిన జొమాటో
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏప్రిల్ 22 ఎర్త్‌డే సందర్భంగా జొమాటో(Zomato) కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. అందరూ ఏదో వారికి నచ్చిన ఫొటోని పోస్ట్ చేస్తూ ఎర్త్‌డే(Earth Day) విషెస్ తెలిపారు. కానీ జొమాటో తన పోస్ట్‌తోనే ఎర్త్‌డే రోజు ఓ మంచి పనికి ఆరంభం పలికింది. ట్విట్టర్‌లో కొన్ని ముఖ్యమైన పోస్టులతో పాటు 'ఎర్త్‌డే కోసం మా వద్ద పోస్ట్ లేదు. దానికి మా దగ్గర ప్రణాళిక ఉంది' అంటూ పేర్కొంది. జొమాటో సంస్థ డెలివరీ చేసే ఫుడ్ కోసం వాడే ప్లాస్టిక్ వేస్ట్‌పై 2020లో చాలా ట్రోల్స్ వచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని జొమాటో సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. 2020లో దాదాపు 40 కోట్ల ఆర్డర్లు జరిగాయి. వాటికోసం ప్లాస్టిక్ కంటేనర్స్, క్యారీ బ్యాగ్స్ ని ఉపయోగించారు. ఇది ఆవిష్కరణ కాదు.. భూమి అంతరించడానికే అంటూ నెటిజన్లు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వీటన్నింటిని ఉద్ధేశించి జొమాటో ఓ మంచి పనికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి నుండి జొమాటోలో ఆర్డర్ చేసే ప్రతి ఫుడ్‌ని 100% ప్లాస్టిక్ న్యూట్రల్ డెలివరీలు ఉంటాయి. తమ సంస్థ ప్యాక్ చేసే ప్లాస్టిక్ స్వచ్ఛందంగా రీసైకిల్ చేయబడుతుందని తెలిపింది. ఈ విధంగా రాబోయే సంవత్సరాల్లో దీని ఇంపాక్ట్ అద్భుతంగా ఉంటుందని.. ఆశిస్తూ అందరికి హ్యాపీ ఎర్త్‌డే అంటూ అద్భుతంగా విషెస్ తెలిపింది. ఈ పోస్టులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Advertisement

Next Story