- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను చేసిన తప్పేంటి.. పోలీసుస్టేషన్ ముందు యువకుని ఆత్మహత్యాయత్నం
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పోలీసుల వేధింపులు భరించలేక ఆదివారం అచ్చంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు డబ్బాతో చెదురు బావి తాండకు చెందిన బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులతో ఆత్మహత్యాయత్నం.. చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
నేను ఏం తప్పు చేశాను..
బాధితుడు మాత్రు మాట్లాడుతూ.. శనివారం సాయంత్రం అచ్చంపేట పట్టణంలో పోలీసులు అటకాయించారని, తదుపరి ఇద్దరు పోలీసులు నన్ను పట్టుకొని బలవంతంగా పోలీస్ వాహనంలో సీట్ల కిందకు కుక్కి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి స్టేషన్లో సుమారు రెండు గంటలపాటు విపరీతంగా కొట్టారని బాధితుడు ఆరోపించారు. నేను చేసిన తప్పేంటి ? ఎందుకు కొట్టాల్సివచ్చింది ? కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదా ? టీఆర్ఎస్ పార్టీలో చేరితే దాడులు చేయరా ? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చచ్చిపోతున్నా వదిలిపెట్టండి..
అన్యాయంగా పోలీస్స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేస్తున్న సందర్భంగా నేను చచ్చి పోతున్నాను, మీ కాళ్లు మొక్కుతా, నన్ను వదిలి పెట్టండని, కాస్త మంచి నీళ్ళు ఇవ్వండి అని వేడుకొన్నా పోలీసులు కనికరించలేదని, మరింత విపరీతంగా కొట్టారని బాధితుడు తెలిపారు. ఏఎస్ఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రాంబాబును తక్షణమే సస్పెండ్ చేస్తేనే నాకు న్యాయం జరుగుతుందని బాధితుడు ఆవేదన వెలిబుచ్చాడు.
పోలీసులను సస్పెండ్ చేయాలి..
నాపై దాడి చేసిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలంటూ శ్రీశైలం ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత కుటుంబ సభ్యుల నిరసన వ్యక్తం చేశారు. బాధితుడికి అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.
సీఐ అనుదీప్ చొరవతో..
పోలీస్ స్టేషన్ ముందు ప్రధాన రహదారిపై బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపడుతున్న వారి వద్దకు చేరుకున్న అచ్చంపేట సీఐ అనుదీప్ బాధితునికి తప్పక న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింపజేశారు.