- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika Mandanna: నువ్వు మాకు దొరికిన ఓ వరానివి.. రష్మిక పోస్ట్ ఎవరి గురించంటే?
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika)ప్రజెంట్ ‘పుష్ప-2’(Pushpa-2)Rashmika Mandanna మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, నేషనల్ క్రష్, అలియా భట్(Alia Bhatt)పై ప్రశంసలు కురిపిస్తూ ఇన్‌స్టా ద్వారా ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘అలియా భట్, వేదాంగ్ నటించిన ‘జిగ్రా’(Jigra) మూవీ చూశాను. ఇది ఒక అద్భుతమైన చిత్రం.
నటీనటులు, చిత్ర బృందాన్ని గట్టిగా హత్తుకొని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. అలియా నువ్వు మాకు దొరికిన వరానివి. నీ టాలెంట్‌ని చూసే అవకాశం మాకు ఇచ్చినందుకు థాంక్స్. వేదాంగ్ రైనా(Vedang Raina) నువ్వు మరెన్నో చిత్రాలు నటిస్తే చూడాలనుకుంటున్నా. అయితే రాహుల్ (Rahul)నటన నన్నెంతో సర్‌ప్రైజ్ చేసింది. జిగ్రాలో నీకు మత్తు పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది. వాసన్ బాలా మేకింగ్ చాలా బాగుంది. ఇంకెన్నో విషయాలు చెప్పాలని ఉంది.
చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు తెలుపుతున్నాను లవ్ యూ’’ ని రాసుకొచ్చింది. అంతేకాకుండా కొన్ని రెడ్ హార్ట్ సింబల్స్ కూడా షేర్ చేసింది. కాగా, అలియా, వేదాంగ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జిగ్రా’(Jigra). దీనికి వాసన్ బాలా(Vasan Bala) దర్శకత్వం వహించారు. అయితే యాక్షన్ డ్రామాగా రూపొందిన జిగ్రాను కరణ్ జోహార్ నిర్మించారు. ఇది నేడు అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అంతేకాకుండా సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది.