- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijayasai Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఫైర్
దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారంలో ఉన్నప్పుడు గ్రాఫిక్స్‌లో చూపారంటూ విమర్శించారు. అందుకోసం 25 ఎకరాల భూమి కేటాయించినట్టు చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆ విగ్రహం ఎక్కడ ఉంది... ఆ 25 ఎకరాల భూమి ఎక్కడుందో ఎవరికీ తెలియదు. విగ్రహ నిర్మాణానికి ఇటుక కూడా వేయలేదు. బూటకపు వాగ్దానాలతో దళితులను తుప్పు నాయుడు మోసగించారంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు అవకాశం దొరికితే ఆర్టీసీని తుక్కు కింద అమ్మేద్దామని చూశాడే తప్ప ఒక్క బస్సు కొన్న పాపాన పోలేదు తుప్పు నాయుడు. 998 అద్దె బస్సులు, 1,150 బస్సుల ఆధునికీకరణ, దశలవారీగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టి ఆర్టీసీని సురక్షిత, సుఖమయ ప్రయాణంగా మారుస్తున్నారు జగన్ అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.
పారిశ్రామిక ప్రమాదాలపై పేలాలు ఏరుకోవడం ఏంటి?
'థర్మల్ కేంద్రాలు దిగుమతి చేసుకునే బొగ్గు ధర టన్నుకు 500% పెరిగి రూ.24,450కి చేరింది. 2019 మేలో దీని ధర రూ.3,428 ఉండేది. ఏటా 9 కోట్ల టన్నుల బొగ్గు దిగుమతి అవుతోంది. కరెంటు ధరలు పెరగటానికి ఇదే ప్రధాన కారణం. బొగ్గు ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించేదాకా ఇదే పరిస్థితి. పారిశ్రామిక ప్రమాదాలపై కూడా 'పేలాలు' ఏరుకోవడం ఏంటి అయ్యన్నా? గోదావరి పుష్కరాల్లో బాబు షూటింగ్ సరదా కారణంగా 30 మంది అమాయకులు చనిపోతే ఎంత మంది మంత్రులు పరిగెత్తుకెళ్లారు? మృతుల్లో ఉత్తరాంధ్ర భక్తులే ఎక్కువ. ఆ టైంలో నీవు ఏ రాచకార్యాల్లో మునిగావు? ఇప్పుడు నీతులు చెబుతున్నావు' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.
ఎస్వీ యూనివర్సిటీలో జాబ్ మేళాపై చర్చ..
మరోవైపు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తిరుపతిలో శుక్రవారం పర్యటించారు. ఈనెల 16,17 తేదీల్లో వైసీపీ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో నిర్వహించనున్న జాబ్‌మేళాకు సంబంధించిన ఏర్పాట్లపై విజయసాయిరెడ్డి చర్చించారు. ఎస్వీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.రాజారెడ్డి, రెక్టార్ వి.శ్రీకాంత్ రెడ్డి, రిజిస్ట్రార్ మొహమ్మద్ హుస్సేన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డిలు విజయసాయిరెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వారితో చర్చించారు. అనంతరం మేళా వాలంటీర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ కల్పనే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే తిరుపతిలో రెండురోజులపాటు జరిగే జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. జాబ్ మేళాలో అర్హులందరికీ అవకాశం ఉంటుందని.. జాబ్ మేళా కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. అలాగే జాబ్‌మేళాకు 1.5 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. 5 పార్లమెంట్ సెగ్మెంట్లలో అభ్యర్థులందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగ కల్పనలో ఏపీ ప్రభుత‍్వం ముందు వరుసలో ఉందని… కుల మతాలకు అతీతంగా అందరికీ అవకాశాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కుల పార్టీ అని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాలకు చెందిన పార్టీ అని అందుకే తమ ప్రభుత్వం వారికి అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి వెల్లడించారు.
- Tags
- vijayasai reddy