World Book Day: పుస్తకం ఓ నేస్తం.. పుస్తక దినోత్సవం స్పెషల్

by samatah |   ( Updated:2022-05-03 09:26:03.0  )
World Book Day: పుస్తకం ఓ నేస్తం.. పుస్తక దినోత్సవం స్పెషల్
X

World Book and Copyright Day

దిశ, వెబ్‌డెస్క్ : పుస్తకం, చదవడానికి మూడక్షరాలే అయినా ఎంతో మంది కలలకు ఆధారం, సామాన్యుని ఆయుధం పుస్తకం. ఓమంచి నేస్తం ..ఒంటరితనంలో తోడు పుస్తకం. ఒక పుస్తకాన్ని చదవడం వలన ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకోవచ్చును. అందుకే చినిగిన చొక్కానైనా తొడుక్కోకాని మంచి పుస్తకం కొనుక్కొమ్మన్నాడు గురజాడ అప్పరావు. మంచి పుస్తకం వేలాది మంది స్నేహితులతో సమానం అన్నారు మరో మహాను భావుడు. ఇలా ఒకొక్కరు పుస్తక విషిష్టను తెలియజేశారు. పుస్తకాలు చదవడం వలన జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మహానుభావుల విజయగాథలు, ఆత్మకథలు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతాయి. పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని సంపాదించి ఎందరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. అందమైన అక్షరాలు, పదాల పలకరింపుతో పాఠకున్ని తనలో లీనం చేసుకుంటుంది పుస్తకం. ఇక విజ్ఞాన్ని అందించే భాంఢాగారం పుస్తకం. ఉదయాన్నే ఛాయ్ తాగినప్పుడు మొదటి చప్పరింపు ఎంత హాయిని ఇస్తుందో పుస్తకం అంతే హాయ్‌ని ఇస్తుంది అంటారు కొందరు. అందువలన అందరూ కనీసం రోజుకు ఒక్క పుస్తకమైనా చదవాలని చెబుతుంటారు పెద్దలు.

ఆనాడు పుస్తకాలున్నా డబ్బులు లేవు..

ప్రస్తుతం పుస్తకాలు చదవడాని ఎవరూ ఆసక్తి చూపడం లేదు. గతానికి ప్రస్తుతానకి చాలా తేడా ఉంది. గతంలో చాలా పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉండేవి కానీ చదువుకోవాలని ఆశ ఉన్నవారికి మాత్రం డబ్బులు ఉండేవి కాదు. ఉదా : అంబేడ్కర్‌కు పుస్తకాలంటే చాలా ఇష్టం కానీ కొనుక్కోవడానికి అతని దగ్గర డబ్బులు ఉండేవి కాదు అందువలన ఆయన ఒకరోజు లైబ్రెరీలో ఉండి ఒక పుస్తకం చదువుకొని దాన్ని తిరిగి ఇచ్చి మరొక పుస్తకం తెచ్చుకునేవారు.

ఈనాడు పుస్తకాలున్నా సమయం లేదు..

ఈ తరం అంటే మన తరం చెప్పడానికి ఏం ఉంది సగం జీవితం పుస్తకం అయితే ఇంకో సంగం జీవితం ఇంటర్నెట్‌లో గడపడానికే సమయం కుదరడం లేదు. ఇప్పటి పిల్లలకు పుస్తకాలంటే విసుగు. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉంటూ కాలం గడుపుతున్నారు. రాను రాను కాలంలో పుస్తకాలను మ్యూజియంలో పెట్టుకొని చూడటం తప్పితే చదవడానికి ఆసక్తి చూపించే వారు ఉండరేమో అంటున్నారు కొందరు. అందువలన పుస్తకాన్ని చదవడం మర్చిపోకుండా ఉండటానికి పుస్తక పఠనాన్ని తల్లిదండ్రులు, పెద్దలు బాధ్యతగా స్వీకరించి పిల్లలతో చిన్నప్పటి నుండే చదివించాలి.

పుస్తక దినోత్సవం..

ఏప్రిల్ 23న పుస్తక దినోత్సవం జరుపుకుంటాం. ఏప్రిల్ 23 పుస్తక దినోత్సవం. ఆ రోజును ప్రపంచ పుస్తక దినోత్సవంగా పరిగణించడంపై విభిన్న కథనాలున్నాయి. 17వ శతాబ్దంనాటి యూరప్‌లో ఈ రోజును సెయింట్ జార్జ్ డే‌గా పాటించేవారు. స్పెయిన్‌లో ఇదే రోజున ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని బహుమతిగా ఇస్తారు. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అనే ప్రఖ్యాత రచయితలు 1616 సంవత్సరంలో ఇదే రోజు మరణించారు. అంతేకాదు జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిస్ ద్రువాం ఇలా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజు మరణించడమో, జన్మించడమో కూడా ఈ పుస్తక దినోత్సవం చేసుకోవడానికి ఒక కారణం. ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు తేదీల్లో పుస్తక మహోత్సవాలు నిర్వహించినా ఇన్ని ప్రత్యేకతలున్న ఏప్రిల్ 23 వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవం పాటించాలని 1955లో యునెస్కో ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచ పుస్తక, కాపీ హక్కుల దినంగా జరపాలని, రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. అలాగే ఏటా ప్రపంచంలోని ఒక ప్రముఖ నగరాన్ని 'ప్రపంచ పుస్తక రాజధాని'గా ప్రకటిస్తూ వస్తోంది. 2017 సంవత్సరానికి గానూ రిపబ్లిక్‌ ఆఫ్‌ గినీలోని 'కొనాక్రీ' సిటీని, 2018 సంవత్సరానికి గానూ గ్రీస్‌లోని 'ఏథెన్స్‌' నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది. 2019 సంవత్సరానికి కూడా దరఖాస్తులు చేస్కోవాల్సిందిగా తాజా ప్రకటన చేసింది యునెస్కో.

Advertisement

Next Story

Most Viewed