Corona Cases: 110 దేశాల్లో పెరుగుతున్న కరోనా మహమ్మారి: WHO

by Mahesh |   ( Updated:2022-06-30 06:43:25.0  )
WHO Says Corona Cases On Rise In 110 Countries
X

దిశ, వెబ్‌డెస్క్: WHO Says Corona Cases On Rise In 110 Countries| ప్రపంచ వ్యాప్తంగా మారణహోమం సృష్టించిన కరోనా మహమ్మారి.. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. వరుసగా వివిధ రకాల వేరియంట్లతో రెండు సంవత్సరాల నుంచి కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అయితే, ఇప్పుడు ఈ మహమ్మారి కాస్త తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పుంజుకుంటుంది. దీనిపై WHO చీఫ్ 110 దేశాల్లో COVID-19 కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.

"ఈ మహమ్మారి మారుతోంది, కానీ, అది ముగియలేదు. మేము పురోగతి సాధించాము కానీ ఇది ముగియలేదు." "రిపోర్టింగ్, జెనోమిక్ సీక్వెన్సులు క్షీణిస్తున్నందున వైరస్‌ను ట్రాక్ చేసే మా సామర్థ్యం ముప్పులో ఉంది, అంటే ఓమిక్రాన్‌ను ట్రాక్ చేయడం, భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న వేరియంట్‌లను విశ్లేషించడం కష్టంగా మారుతోంది" అని WHO చీఫ్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ అన్నారు.

Also Read: లక్ష దాటిన కరోనా కేసులు.. నాలుగో వేవ్ ముంగిట భారత్

Advertisement

Next Story

Most Viewed