- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లల్లో న్యాపీ ర్యాష్.. కంట్రోల్ చేయడం ఎలా?
దిశ, ఫీచర్స్: పిల్లలు మాటలు నేర్చుకునే వరకు తల్లిదండ్రులకు కష్టమే. ముఖ్యంగా వాళ్లు ఎందుకు ఏడుస్తున్నారో? ఏం చెప్పాలనుకుంటున్నారో? తెలియక పేరెంట్స్ సతమతమవుతుంటారు. వారి బాధకు కారణమేంటో కనిపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. అయితే చిన్నపిల్లల్లో న్యాపీ వల్ల తలెత్తే దద్దుర్లు(ర్యాష్) కూడా ఈ సమస్యల్లో ఒకటి కాగా.. ఇది ఎందుకు వస్తుంది? నిపుణులు సూచిస్తున్న పరిష్కార మార్గాలేంటి? చూద్దాం.
ప్రతీ నలుగురు పసిబిడ్డల్లో ఒకరికి న్యాపీ కారణంగా దద్దుర్లు ఏర్పడుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. ఈ ర్యాష్.. మైల్డ్‌గా ఉంటే పరవాలేదు కానీ సీవియర్ కేసుల్లో చిన్నారులు అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతారని, ఎర్రగా కందిపోయిన ప్రాంతంలో ముట్టుకుంటే బాధతో అల్లాడిపోతారని వెల్లడిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా ఐదు కారణాలుండగా.. నివారించేందుకు నిపుణులు ఇస్తున్న సలహాలు.
యూరిన్ ద్వారా చిరాకు
నార్మల్ న్యాపీస్‌లో పిల్లలు యూరిన్ లేదా టాయిలెట్ చేసినపుడు అవి తడిని ఎక్కువగా శోషించుకోలేవు. దీంతో బేబీస్ చిరాకు పడతారు. ఇదే పరిస్థితి ఎక్కువ సేపు కొనసాగితే ర్యాష్ ఏర్పడుతుంది. యూరిన్‌లో ఉండే ఆమ్ల లక్షణాలు చర్మం విచ్ఛిన్నానికి కారణమవుతాయి. అబ్జార్బెంట్ డైపర్ యూజ్ చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరికే అవకాశముంది.
బేబీ ప్రొడక్ట్స్ రియాక్షన్
సాధారణంగా చిన్నారులకు వాడే బేబీ లోషన్, పౌడర్స్.. నేచురల్ ప్రొడక్ట్స్ అయినప్పటికీ వారి స్కిన్‌పై రియాక్షన్ చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉత్పత్తుల్లో ఉండే సెంట్, సువాసనల వల్ల ర్యాషెస్ వచ్చే అవకాశముంది. లోషన్స్ మాత్రమే కాదు డైపర్స్, డిటర్జెంట్స్, ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్స్‌లో ఉండే ఫ్రాగ్రెన్స్ కూడా దద్దుర్లకు కారణం కావచ్చని.. అందుకే ఫ్రాగ్రెన్స్ ఫ్రీ న్యాపీస్ యూజ్ చేయాలని సూచిస్తున్నారు.
బ్యాక్టీరియల్ లేదా ఫంగస్ ఇన్‌ఫెక్షన్
బ్యాక్టీరియా, ఈస్ట్ వంటి సూక్ష్మజీవులు వెచ్చని, తేమతో కూడిన ప్రాంతాలను ఇష్టపడుతుంటాయి. ఇవి కూడా పిల్లల్లో న్యాపీ ర్యాష్‌కు కారణమవుతుండగా.. ఈ ఇన్‌ఫెక్షన్ నుంచి బయటపడేందుకు యాంటీ ఫంగల్ క్రీమ్స్, యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్స్ సజెస్ట్ చేస్తుంటారు ఎక్స్‌పర్ట్స్. డైపర్ ప్రాంతంలో దద్దుర్లు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని లేదంటే చర్మం విచ్ఛిన్నానికి కారణమవుతుందని, బేబీకి పెయిన్ మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ప్రాబ్లమ్ విత్ ఇంపర్ఫెక్ట్ న్యాపీ
బేబీకి సరిపోయే న్యాపీని వాడకపోవడం కూడా సమస్యగా పరిణమిస్తుంది. ఇంపర్ఫెక్ట్ న్యాపీ యూజ్ చేయడం వల్ల బేబీ ఒంటిపై స్క్రాచెస్ ఏర్పడతాయి. అందుకే న్యాపీ సరిగ్గా ఉందో లేదో నిర్ధారించుకోవాలని.. లేదంటే పిల్లల తొడల చుట్టూ ఉండే బిగుతైన అంచుల వల్ల శ్వాస తీసుకునేందుకు కష్టమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
పిల్లల్లో న్యాపీ ర్యాష్.. కంట్రోల్ చేయడం ఎలా?
సడెన్‌గా చిల్డ్రన్ డైట్ చేంజ్ చేయడం కూడా ర్యాష్‌కు కారణమవుతుంది. డైట్‌లో మార్పు పిల్లల యూరిన్/మలంలో తేడాలు తీసుకొస్తుంది. అలా చేసినప్పుడు ఫ్రీక్వెంట్‌గా డైట్ చెక్ చేస్తూ, మారుస్తూ ఉండాలని సూచిస్తున్నారు. పిల్లలు ఎప్పుడు టాయిలెట్ చేసినా వెంటనే న్యాపీ చేంజ్ చేయడం మంచిదని, మరోసారి వెళ్లాక చేద్దామని ఊరుకుంటే పిల్లల హెల్త్ ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు.