ప్రజల ఆకాంక్ష నెరవేరే విధంగా రాష్ట్ర బడ్జెట్

by Naveena |
ప్రజల ఆకాంక్ష నెరవేరే విధంగా రాష్ట్ర బడ్జెట్
X

దిశ, కొత్తకోట: తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం కొత్తకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని జయశంకర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి55, షాదీ ముబారక్5, మొత్తం 60,చెక్కులను పంపిణీకి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈరోజు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో విద్య, వైద్యానికి 40,000 కోట్లు కేటాయించడం జరిగిందని ఇచ్చిన ఆరోగ్యారెంటీ పథకాలకు అమలు అయ్యే విధంగా 56,వేల కోట్లు, అలాగే వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ 30,వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. అన్నిటికీ కలిపి 3లక్షల,4వేల కోట్లు బడ్జెట్ను కేటాయించడం జరిగిందని తెలిపారు.

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా బడ్జెట్ను కేటాయించడం జరిగిందని దేవరకద్ర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మదనపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్, ఎమ్మార్వో వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీచుపల్లి యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బోయేజ్, కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మేస్త్రి శ్రీను, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, డాక్టర్ పి జె బాబు, మిషేక్, సుభాష్, నవీన్, సంద వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story