- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మోసపోయాను న్యాయం చేయండి : ఒక మహిళ ఆవేదన..

దిశ, ఖైరతాబాద్ : యు.ఎస్ వెళ్లే కలను నిజం చేస్తానంటూ తనను హైదరాబాద్ గాంధీనగర్ కు చెందిన నితిన్ కుమార్ కామిని మోసం చేశాడంటూ సునీత అనే మహిళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆరోపించింది. ఈ సందర్భంగా బాధితురాలు సునీత మాట్లాడుతూ తాను మహారాష్ట్ర వాస్తవ్యురాలినని అయితే 2009వ సంవత్సరంలో హైదరాబాద్ కు వచ్చి వృత్తిరీత్యా కొన్ని కంపెనీలకు ఫ్రీ లాన్సర్ గా మార్కెటింగ్ వృత్తిలో ఉన్నట్టు తెలిపారు. అయితే 2023 వ సంవత్సరంలో తన ఫ్రెండ్ అయినా మరో మహిళా ద్వారా పరిచయమైన నితిన్ కుమార్ కామిని తన చిరకాల కల అయినా యుఎస్ వెళ్లడానికి అన్ని రకాలుగా సహకరిస్తానంటూ తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకొని రెండు సంవత్సరాలు గడిచాక దాటవేస్తూ ఇది ఏంటి అని అడిగిన నన్ను దుర్భాషలాడుతూ, భౌతిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ విషయమై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు మార్చి నాలుగున ఎఫ్ఐఆర్ చేశారని అన్నారు. ఎఫ్ఐఆర్ చేసిన నాటినుండి దాదాపు 15 రోజులు గడుస్తున్న తనను మోసం చేసిన నితిన్ కుమార్ కామిని అనే వ్యక్తిని ఇప్పటివరకు అరెస్టు చేయకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి మరొక ఆడపిల్లకు ఇతని వల్ల మోసం జరగకుండా చర్యలు తీసుకొని తనకూ న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. నితిన్ కుమార్ కామిని అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తే ఇంకా అతని చీకటి కోణాలు బయటపడతాయి అని అన్నారు.