Ap: రాష్ట్రంలో సంచలనం పరిణామం.. ముదురుతున్న వివాదం

by srinivas |   ( Updated:2025-03-20 16:00:16.0  )
Ap: రాష్ట్రంలో సంచలనం పరిణామం.. ముదురుతున్న వివాదం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ మధురవాడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం(Visakhapatnam Madhurawada International Cricket Stadium) పేరులోని వైఎస్సార్(Ysr) పేరు తొలగించడం పొలిటికల్ ఫైట్‌కు దారి తీసింది. వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం(YSR ACA-VDCA Cricket Stadium) పేరు మారుస్తూ రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తో్ంది. మాజీ మంత్రి అమర్‌నాథ్(Former Minister Amarnath) ఆధ్వర్యంలో మధువాడలోని స్టేడియం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పేరు తొలగించడం ఏసీఏ(ACA) కుట్రనా.. లేదా ప్రభుత్వపని తనమా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ బ్రాండ్ లేకుండా ప్రయత్నం చేస్తోందన్నారు. వైసీపీతో పాటు రాజశేఖర్ రెడ్డి పేరు కూడా లేకుండా చేయాలనే ఆలోచనతో పని చేస్తోందని మండిపడ్డారు.

కాగా 2003లో ఈ స్టేడియాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఇంటర్నేషనల్ టోర్నీలకు ఆతిథ్యం ఇస్తోంది. 2009లో అప్పటి ఏసీఏ పాలకవర్గం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును స్టేడియంకు పెట్టారు. అప్పటి నుంచి వైఎస్సార్ స్టేడియంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ నెలలో రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో స్టేడియంలో మోడ్రనైజేషన్ పనులు చేస్తున్నారు. గ్యాలరీలతో పాటు ఇతర ఆకృతుల్లో మార్పులు చేస్తోంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన గ్లో సైన్ బోర్డులపై వైఎస్సార్ పేరును తొలగించారు. ఇటీవల ఏసీఏ బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గం నేతలే వైఎస్సార్ పేరు తొలగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైఎస్సార్ పేరును ఎందుకు తొలగించారో చెప్పాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో.

Next Story