మూడేళ్లలో తెలుగు రాష్ట్రాల అప్పులు ఎంతంటే?

by Sathputhe Rajesh |   ( Updated:2022-07-25 12:06:57.0  )
మూడేళ్లలో తెలుగు రాష్ట్రాల అప్పులు ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రత్యేక కార్పొరేషన్‌ల ద్వారా తీసుకునే రుణాలను సైతం ఇకపై ప్రభుత్వ అప్పులుగానే పరిగణించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గడచిన మూడేళ్ళలో బహిరంగ మార్కెట్‌ నుంచి రాష్ట్రాలు తీసుకున్న రుణాల జాబితాను సోమవారం కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కాంగ్రెస్‌ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం విధించిన నికర రుణ పరిమితి ప్రకారం బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకున్న రుణాల జాబితాను పార్లమెంటుకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. బడ్జెటేతర రుణాల వివరాలు లేకుండా కేవలం బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకున్న రుణాల వరకే వివరాలను ఇచ్చిన కేంద్రం.. ఇతర మార్గాల ద్వారా తీసుకున్న రుణాలకు బడ్జెట్‌ నుంచి అసలు, వడ్డీ చెల్లిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇకపై అలా చెల్లిస్తే వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కిందనే పరిగణించాల్సి వస్తుందని ఇప్పటికే హెచ్చరించామని కేంద్రం పేర్కొంది. బ్రేవరేజ్ కార్పొరేషన్ లాంటి వాటి ద్వారా తీసుకునే రుణాలు కూడా ఇకపై రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుగానే పరిగణిస్తామని, టాక్స్‌లు, సెస్‌లను తాకట్టు పెట్టి తెచ్చే అప్పులనూ రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే చూస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంకు 'స్టేట్‌ ఫైనాన్స్‌: ఎ స్టడీ ఆఫ్‌ బడ్జెట్స్‌ 2021-22' పేరుతో ఒక నివేదిక తయారు చేసినట్లు సమాధానంలో మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకున్న రుణాలపై రిజర్వ్‌ బ్యాంకు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పులు తెలంగాణ అప్పుల కంటే మించిపోయాయి. తెలుగు రాష్ట్రాల అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి..

ఆంధ్రప్రదేశ్‌ అప్పులు

2020 మార్చి 31 నాటికి: రూ.3,07,671.5 కోట్లు

2021 మార్చి 31 నాటికి: రూ.3,60,333.4 కోట్లు

2022 మార్చి 31 నాటికి: రూ.3,98,903.6 కోట్లు

తెలంగాణ అప్పులు

2020 మార్చి 31 నాటికి : రూ.2,25,418.0 కోట్లు

2021 మార్చి 31 నాటికి : రూ.2,67,530.7 కోట్లు

2022 మార్చి 31 నాటికి : రూ.3,12,191.3 కోట్లు

గూగుల్ కో-ఫౌండర్‌ భార్యతో ఎఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన ఎలన్ మస్క్

53వ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు న్యూడ్ బాడీ గిఫ్ట్ ఇచ్చిన జెన్నిఫ‌ర్ లోపెజ్

Advertisement

Next Story