- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ విజయం దేశంలోని ఎంతో మందికి స్ఫూర్తి: Mamata Banerjee
దిశ, వెబ్‌డెస్క్: West Bengal CM Mamata Banerjee Lauds Weightlifter Achinta Sheuli for Winning Gold medal In CWG 2022| కామన్వెల్త్ గేమ్స్ 2022లో వెస్ట్ బెంగాల్‌కు చెందిన 20 ఏళ్ల వెయిట్‌లిఫ్టర్ అచింత షెయులీ స్వర్ణం పతకం సాధించాడు. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పసిడి పతకం అందించిన అచింత షెయులీకి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా గోల్డ్ బాయ్ షెయులీని అభినందించారు. ''పశ్చిమ బెంగాల్‌కు చెందిన అచింత షెయులీ CWG, 2022లో మూడవ బంగారు పతకాన్ని గెలుచుకోవడం నిజంగా మనందరికీ గర్వకారణం. ఆయనకు హృదయపూర్వక అభినందనలు. మీ విజయం దేశంలోని అసంఖ్యాక మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. మీ భవిష్యత్ ప్రయత్నాలకు ఆల్ ది బెస్ట్!'' అంటూ ట్విట్టర్లో ప్రశంసలు కురిపించారు. ఇక బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత వెయిట్ లిఫ్టర్లు సత్తా చాటుతున్నారు. ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటి వరకు భారత్ 6 పతకాలు సాధించగా.. అన్ని కూడా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలోనే రావడం విశేషం.
ఇది కూడా చదవండి: డ్రగ్ మాఫియాకు అండగా నిలుస్తోన్న ఆ నేతలు ఎవరు..?