- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ration Mafia: రెచ్చిపోతున్న మాఫియా.. సరిహద్దు దాటుతున్న రేషన్ బియ్యం
రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం సరిహద్దు దాటుతోంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల నుంచి ఏపీ, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం, వీరులపాడు మండలాలకు యథేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. నిత్యం ద్విచక్ర వాహనం మొదలుకొని బొలెరాల వరకు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నారు. మునుకళ్లకు చెందిన ఓ వ్యక్తి ఈ అక్రమ రవాణాకు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ఇటీవల తనకు రేషన్ బియ్యం విక్రయించని నెమలికి చెందిన ఓ చిరు వ్యాపారిపై గంపలగూడెం మండలానికి చెందిన డాన్ పంజా విప్పి.. అక్కడి పోలీసులతో దాడులు చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఆ డాన్‌కు బియ్యం సరఫరా చేస్తేనే వ్యాపారమంతా సక్రమంగా జరుగుతుందని, అతన్ని కాదని వేరే వ్యాపారులకు బియ్యం సరఫరా చేస్తే పోలీసులు రెవెన్యూ వర్గాల దాడులు క్షణాల్లో జరుగుతాయనే విమర్శలు ఉన్నాయి. దీంతో నిత్యం టన్నుల కొద్ది బియ్యం తెలంగాణ నుంచి ఆంధ్రాకు తరలివెళ్తున్నా కనీసం పట్టించుకునే వారే కరువయ్యారు.
దిశ, వైరా: ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం సరిహద్దు దాటుతోంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం, వీరులపాడు మండలాలకు, యథేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. నిత్యం ద్విచక్ర వాహనం మొదలుకొని బొలెరోల వరకు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నారు. గంపలగూడెం మండలం రేషన్ బియ్యం వ్యాపారాన్ని ఈనెల1వ తేదీ నుంచి తన కబంధహస్తాల్లోకి తీసుకున్న మునుకళ్లకు చెందిన ఓ చార్యుడు ఈ అక్రమ రవాణాకు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. అయినప్పటికీ కనీసం పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో నిత్యం టన్నుల కొద్ది బియ్యం తెలంగాణ నుంచి ఆంధ్రాకు తరలివెళ్తోంది. అయితే ఇటీవల తనకు రేషన్ బియ్యం విక్రయించని నెమలికి చెందిన ఓ చిరు వ్యాపారిపై గంపలగూడెం మండలానికి చెందిన డాన్ పంజా విప్పి అక్కడి పోలీసులతో దాడులు చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఆ డాన్‌కు బియ్యం సరఫరా చేస్తేనే వ్యాపారమంతా సక్రమంగా జరుగుతుందని, అతన్ని కాదని వేరే వ్యాపారులకు బియ్యం సరఫరా చేస్తే పోలీసులు రెవెన్యూ వర్గాల దాడులు క్షణాల్లో జరుగుతాయనే విమర్శలు ఉన్నాయి.
నిత్యం టన్నుల కొద్దీ రవాణా
ఖమ్మం జిల్లాలోని వైరా, తల్లాడ, బోనకల్, కల్లూరు, పెనుబల్లి, కొణిజర్ల, చింతకాని తదితర మండలాల నుంచి ఆంధ్రాకు నిత్యం రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. ప్రధానంగా వైరా మండలంలోని దాచాపురం క్రాస్ రోడ్డు నుంచి తెలంగాణకు చెందిన బియ్యం ఆంధ్రాకు తరలి వెళ్తోంది. అంతే కాకుండా మిగిలిన మండలాల సరిహద్దుల్లో ఉన్న సరిహద్దుల నుంచి ఆంధ్రాకు బియ్యం ఎగుమతి చేస్తున్నారు. మునుకుళ్లకు చెందిన చార్యుడు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గన్నవరం గ్రామంలోని వెంకట కృష్ణుడు, హనుమంతుడు, తల్లాడ, వైరా మండలానికి చెందిన పలువురు యథేచ్ఛగా రేషన్ బియ్యం వ్యాపారం కొనసాగిస్తున్నారు. వీరు రాత్రి వేళల్లో బియ్యాన్ని బొలెరో వాహనాల్లో సరిహద్దు దాటిస్తున్నారు. అయినప్పటికీ కనీసం పట్టించుకునే వారు కరువయ్యారు.
ఆ రెండు మండలాలు అతని గుప్పెట్లోనే..
ఖమ్మం జిల్లాలోని మధిర ఎర్రుపాలెం మండలాల్లోని రేషన్ బియ్యం వ్యాపారం ఆంధ్రా ప్రాంతం జయంతికి చెందిన ఓ సత్యుడు గుప్పెట్లో ఉంది. ఈ రెండు మండలాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని జయంతికి చెందిన ఓ వ్యాపారికి సరఫరా చేస్తున్నారు. అయితే పలు శాఖల అధికారులను మేనేజ్ చేస్తున్న ఆ వ్యాపారి నిరాటంకంగా ఈ బియ్యాన్ని సరిహద్దు దాటిస్తున్నారు. ఇదంతా బహిరంగంగా కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. తెలంగాణ ప్రాంతంలోని బియ్యాన్ని ఒకవైపు మునుకళ్ల వ్యాపారి, మరోవైపు జయంతి వ్యాపారి అక్రమంగా కొనుగోలు చేస్తున్న కనీసం నిఘా వ్యవస్థలు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి రేషన్ బియ్యం మాఫియాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
అక్రమ బియ్యం రవాణాపై చర్యలు తీసుకుంటాం - రామచంద్రయ్య, పౌరసరఫరాలశాఖ డీటీ
బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటాం. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం మా దృష్టికి రాలేదు. ఈ వ్యవహారంపై ప్రత్యేక నిఘా పెడతాం. సరిహద్దు ప్రాంతాల్లోని తెలంగాణలో ఉన్న మండలాల్లో బియ్యం వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతాం. అక్రమ బియ్యం రవాణా చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాను.