Bellam Palli: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పై పోలీసులకు ఫిర్యాదు..

by Ramesh Goud |
Bellam Palli: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పై పోలీసులకు ఫిర్యాదు..
X

దిశ,బెల్లంపల్లి: బెల్లంపల్లి టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై రామటింకి శరణ్య అనే మహిళ పాల గురజాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి గ్రామానికి చెందిన రాoటెంకి శరణ్య శుక్రవారం ఆరిజన్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ కందిమళ్ల ఆదినారాయణ కు చెందిన కన్నాల శివారులోని భూమిలో కూలీపనికి వెళ్ళింది. శుక్రవారం మధ్యాహ్నం బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, డ్రైవర్ కృష్ణ, గన్ మెన్ తో వచ్చి 'నా భూమిలో ఏమిచేస్తున్నారని ఇక్కడి నుండి వెళ్ళకపోతే చంపుతామంటూ బెదిరించారని తెలిపారు. భయభ్రాంతులకు గురి చేశారనీ ఫిర్యాదులు పేర్కొన్నారు.ఆ సమయంలో గన్‌మెన్ వద్ద గన్ ఉండడంతో చంపుతానని అనడంతో భయభ్రాంతులకు గురైనట్లు తెలిపారు. తమను పనిలోకి పిలిపిoచిన ఆదినారాయణ చెప్పగా, ఆదినారాయణ వచ్చే సరికి భూమి నుండి చిన్నయ్య వెళ్లిపోయాడని తెలిపారు. ఆ సమయంలో నాతోపాటు కూలి పనికి వచ్చిన తమను గన్‌మెన్ తో వచ్చి చంపుతానంటూ భయభ్రాంతులకు గురి చేసిన చిన్నయ్య పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed