Nijamabad: రూ.500 బోనస్‌ వచ్చేసింది.. జిల్లా వ్యాప్తంగా రైతుల సంబరాలు

by Ramesh Goud |   ( Updated:2024-11-23 01:57:43.0  )
Nijamabad: రూ.500 బోనస్‌ వచ్చేసింది.. జిల్లా వ్యాప్తంగా రైతుల సంబరాలు
X

సన్న రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు రైతుల ఖాతాల్లో ఆ సొమ్ము జమ అవుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెల్లిం పులు ప్రారంభం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 3,223మంది రైతులకు రూ.12,52,43,400 కోట్లు సన్నాలకు బోనస్ గా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేసింది. ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం 673కొనుగోలు కేంద్రా లను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. వీటిలో ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఏజెన్సీల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్లను చేపట్టారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఈ సీజన్ నుంచే మద్దతు ధరతోపాటు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం హామీ మేరకు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 364569.240 మెట్రిక్ టన్ను ల ధాన్యాన్ని కొనుగోళ్లు జరిగాయి. వీటిలో గ్రేడ్ ఏ రకం12, 3883.600 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 18,10.720 మెట్రిక్ టన్నులు కాగా, సన్నాలు 23, 8874.920 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా కొనుగోళ్లు జరుగుతున్నాయని, డిసెంబర్ 20నాటికి కొనుగో ళ్లు దాదా పు పూర్తయ్యే అవకాశాలున్నాయని అధికా రులు పేర్కొన్నారు. ఇప్పటికే పలు చోట్ల కొనుగోళ్లు పూర్తి కాగా 46కేంద్రాలను అధికారులు మూసివే శారు.

ఇప్పటి వరకు రైతులకు రూ.369 కోట్లు చెల్లింపులు జరిగాయని, ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమయినట్లు తెలిపారు. వీటిలో సన్నరకం ధాన్యం కు రూ. 245.88 కోట్లు, దొడ్డు రకం ధాన్యానికి రూ.123.27 కోట్లు రైతులకు చెల్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. రైతులు ధాన్యం తూకం వేశాక రెండు మూడు రోజుల్లో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతున్నట్లు అధికారులు చెపుతున్నా, రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ కావడానికి వారం రోజుల సమయం పడుతోందని రైతులంటున్నారు. కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేయగానే నిర్వాహకులు ఓపీఎంఎస్ సైట్ లో రైతులకు సంబంధించిన అన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు నమోదు చేస్తే తప్ప రైతుల అకౌంట్ లో ధాన్యం డబ్బులు జమ కావడం జరుగదు. కానీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా సిబ్బంది వివరాలు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, దీంతో రైతుల ధాన్యం డబ్బులు ఖాతాలో జమ కావడంలో ఆలస్యమవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.

రాష్ర్ట ప్రభుత్వం బోనస్ జమ చేస్తుండడంతో సన్న రకాల ధాన్యం మార్కెట్ లోకి పోటెత్తుతోంది. పోయినేడు కంటే ఈ ఏడు సాగు గణనీయంగా పెరిగింది. దీంతో జిల్లాలో ఏ మిల్లు చూసినా, ఏ కొనుగోలు సెంటర్ చూసినా సన్న వడ్ల రాసులే కనిపిస్తున్నాయి. వడ్ల కొనుగోళ్ల కోసం ప్రభుత్వం సెంటర్లు ఏర్పాటు చేసింది. కనీస మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ ఇస్తోంది.

రైతులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్

దిశ, ఆలూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ అన్నారు. మండల కేంద్రంలో రైతుల ఆధ్వర్యంలో రైతు బోనస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం కొను గోలు చేసిన ప్రతి క్వింటాలుకు రూ.500ల బోనస్ రైతుల ఖాతాల లో జమ చేయడం జరిగిందని, రైతుల అందరు ఆనం దంగా ఉన్నారన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి, వినయ్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మిఠా యిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్ర మంలో వైస్ మల్లారెడ్డి, ఉదయ్, ముత్యం, నవనీత్, సంజీవ్, గంగారెడ్డి, అనిల్, రాజేందర్ రైతులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed