- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్సింగ్ అడ్మిషన్ల ‘చిక్కులు’? మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి మూడు రోజుల డెడ్‌లైన్
దిశ, తెలంగాణ బ్యూరో: బీఎస్సీ నర్సింగ్ మేనేజ్‌మెంట్ కోటాలోని సీట్లు భర్తీ చేయడం ప్రైవేటు కాలేజీలకు మళ్లీ సవాల్‌గా మారింది. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం భర్తీ కాని సీట్లను ‘లెఫ్ట్ ఓవర్ కోటా’లో భర్తీ చేసుకోవాలంటూ ఈనెల 16న విడుదల చేసిన సర్క్యులర్‌ను కాళోజీ వర్సిటీ తాజాగా 21న సవరించింది. ఈ మేరకు అన్ని ప్రైవేటు నర్సింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే కేవలం మూడు రోజుల్లోనే ప్రైవేటు నర్సింగ్ కాలేజీలు విద్యార్థులు అడ్మిషన్లు నింపి, వర్సిటీకి వివరాలు పంపించాల్సి ఉంటుంది. దీంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో పాటు స్టూడెంట్స్ కూడా గందరగోళంలో పడ్డారు.
ఇంత తక్కువ సమయంలో అడ్మిషన్లు ఎలా నింపాలి? అంటూ కాలేజీలు.. మంచి కాలేజీలు వెతుక్కునే వెసులుబాటు లేకుండా వర్సిటీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని స్టూడెంట్లు ఫైర్ అవుతున్నారు. కాళోజీ వర్సిటీ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితి వస్తుందని మండిపడుతున్నారు. కనీసం రెండు వారాల సమయం కూడా ఇవ్వకుండా.. వర్సిటీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో? అర్థం కావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు కాలేజీల్లో అడ్మిషన్లు పొందేందుకు కనీసం రెండు వారాల పాటు సమయం ఇవ్వాలని రిక్వెస్టు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని తమకు పరిష్కారం చూపాలని నర్సింగ్ చదవాలని భావిస్తున్న స్టూడెంట్స్ కోరుతున్నారు.
ఫస్ట్ సర్క్యులర్‌లో ఇచ్చి ఉంటే.. ఎందుకీ కన్‌ఫ్యూజన్..?
బీఎస్సీ(4 ఇయర్స్)2024–25 కోర్సుకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రూల్స్ పాటిస్తూ మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లను భర్తీ చేసుకోవచ్చని కాళోజీ హెల్త్ వర్సిటీ ఈనెల 16న అన్ని ప్రైవేటు నర్సింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ సర్క్యులర్‌లో ‘లెఫ్ట్ ఓవర్ కోటా’పై ఎలాంటి ప్రస్తావన లేదు. దీంతో గతంలోనే ప్రైవేటు కాలేజీలు యూనివర్సిటీని సంప్రదించాయి. కానీ, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం మేనేజ్‌మెంట్ కోటా పూర్తి అయిన తర్వాత మిగిలిపోయిన సీట్లను లెఫ్ట్ ఓవర్ కోటాలో భర్తీ చేస్తామని వర్సిటీ అధికారులు ఆఫ్ ది రికార్డులో చెప్పారు. జీవో నెం.108 ప్రకారం (05.09.2024 ) భర్తీ చేసుకోవాలంటూ తాజాగా 21న రివైజ్డ్ సర్క్యులర్ ఇచ్చారు. గడువు తేదీని మాత్రం పాత సర్క్యులర్ ప్రకారమే ఉంచారు. ఈనెల 16న ఇచ్చిన సర్క్యులర్‌లోనే జీవో 108ను కన్సిడర్ చేస్తామని చెప్పి ఉంటే బాగుండునని, అసలు చేస్తారా.. చేయరా? అని క్లారిటీ తీసుకునేలోపే రివైజ్డ్ సర్క్యులర్ వచ్చిందని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లను ఇంటర్‌తోనూ భర్తీ చేసుకోవచ్చని ఈ ఏడాది సెప్టెంబరులో హెల్త్ సెక్రెటరీ జీవో నెం.108లో స్పష్టం చేశారు.
ఐఎన్‌సీ రూల్స్ ఏమిటీ..?
గత కొన్నేళ్ల నుంచి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లకు ఇంటర్ బైపీసీలోని మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తూ వచ్చారు. కానీ, 2023–24 నుంచి నీట్, ఎంసెట్ ఎగ్జామ్‌లోని ఏదో ఒకదాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ఐఎన్‌సీ (ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్) స్పష్టం చేసింది. ఆకస్మికంగా తెరమీదకు తీసుకొచ్చిన ఈ రూల్ అడ్మిషన్ల ప్రాసెస్‌కు చిక్కులు తెచ్చింది. అయితే, ఈ ఏడాది 2024–25 కు కన్వీనర్ కోటాలో ఎంసెట్ 54 వేల ర్యాంక్ కటాఫ్‌తో బీఎస్సీ నర్సింగ్ సీట్లను భర్తీచేయగా, మేనేజ్‌మెంట్ కోటాలో అర్హులెవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ప్రైవేటు కాలేజీల సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎంబీబీఎస్ తరహాలో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు చేస్తున్నామని వర్సిటీ గొప్పగా చెప్తున్నది. కానీ, ఎంబీబీఎస్‌కు నీట్ కామన్ ఎగ్జామ్ అనే విషయం మరిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 112 నర్సింగ్ కాలేజీల్లో 6,500 బీఎస్సీ నర్సింగ్ సీట్లు ఉన్నాయి. ప్రతి ఏటా కన్వీనర్ కోటాలో 4 వేలు సీట్లు నింపుతుండగా, 2,500 సీట్లను మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ చేస్తారు.
వీసీ నిర్లక్ష్యం..?
నర్సింగ్ అడ్మిషన్ల ఎంట్రన్స్ ఎగ్జామ్‌పై ప్రభుత్వం అవగాహన కల్పించదు. వర్సిటీ ప్రచారం చేయదు. దీంతో స్టూడెంట్స్ నష్టపోవాల్సి వస్తుందని ఓ పేరెంట్ చెప్పారు. అవగాహన లేక చాలా మంది విద్యార్థులు ఐఎన్‌సీ (ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్) సూచించిన ఈ పరీక్షలు రాయకపోవడంతో బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు అర్హత పొందలేకపోయారు. వీసీ నిర్లక్ష్యం కారణంగానే మెడికల్, నర్సింగ్ అకాడమిక్ ఇయర్లలో ప్రతీ సారి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు.
ముందే ప్రిపేర్‌గా ఉండాలి: వీసీ కరుణాకర్‌రెడ్డి
ప్రైవేట్ కాలేజీలు ముందే విద్యార్థులను చూసుకోవాలి. ఎంబీబీఎస్ తరహాలోనే అడ్మిషన్లు చేస్తున్నాం. ఎంబీబీఎస్‌కు ఒక్క రోజే సమయం ఇస్తాం. కానీ నర్సింగ్ కాలేజీలకు మూడు రోజుల సమయం ఉన్నది. అడ్మిషన్ల కోసం కాలేజీలు ప్రిపేర్‌గా ఉండాల్సిన అవసరం లేదా?. మేముం ఐఎన్‌సీ రూల్స్ పాటిస్తున్నాం. ప్రైవేటు కాలేజీలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఐఎన్‌సీతో మాట్లాడుకోవాలి. ఫైట్ చేయాలి.