West Bengal Cabinet: బెంగాల్ మంత్రి వర్గంలో మార్పులు

by Naresh |   ( Updated:2022-08-01 11:27:21.0  )
West Bengal Cabinet to be Expanded Says Mamata Banerjee
X

కోల్‌కతా: West Bengal Cabinet to be Expanded Says Mamata Banerjee| పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిద్దుబాటు చర్యలకు దిగారు. టీచర్స్ స్కాంలో మంత్రి పార్థ చటర్జీ అరెస్ట్ కావడంతో ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించి, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి వర్గంలో మార్పులు చేయనున్నట్లు సీఎం మమతా బెనర్జీ సోమవారం తెలిపారు. బుధవారం ఐదుగురు కొత్త ముఖాలకు మంత్రి వర్గంలో చోటు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 'సుబ్రతా ముఖర్జీ, సదాన్ పాండేలను కోల్పోయాం. పార్థ చటర్జీ జైలులో ఉన్నారు. ఒంటరిగా నిర్వహించడం నాకు అసాధ్యం' అని అన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం ప్రక్షాళన చేయాలనే ఆలోచన లేదని చెప్పారు. అంతకు ముందు బెంగాల్‌లో 23 జిల్లాలే ఉండగా, త్వరలోనే ఆ సంఖ్య 30కి చేరనుందని తెలిపారు. కాగా, గత నెల 28న బెంగాల్ ప్రభుత్వం ఈడీ విచారణలో అరెస్టైన పార్థీ చటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి:

మీ విజయం దేశంలోని ఎంతో మందికి స్ఫూర్తి: Mamata Banerjee

Advertisement

Next Story

Most Viewed