- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేసేదే చెప్తాం.. చెప్పేదే చేస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
దిశ, గరిడేపల్లి: చేసేదే చెప్తాం చెప్పేదే చేస్తామని బీఎస్‌పీ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన సమాజ్ వాది పార్టీ రథయాత్ర లో భాగంగా గరిడేపల్లి మండల కేంద్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా అనేక హామీలు ఇచ్చి తెరాస ప్రభుత్వం విఫలమైందని, గరిడేపల్లి లాంటి పెద్ద మండలంలో ఇప్పటికీ ప్రభుత్వ ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలో లేకపోవడం దారుణమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అవసరమైన విద్య, వైద్యం విషయంలో దారుణంగా విఫలమైందని, బహుజన్ సమాజ్ వాది పార్టీ అధికారంలోకి రాగానే విద్య, వైద్యను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అదే విధంగా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో అనేక సిమెంట్ ఫ్యాక్టరీ లు ఉన్నాయి. కానీ వాటిలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా స్థానికేతరులు అయినటువంటి బీహార్, జార్ఖండ్ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి పౌరులను దిగుమతి చేసుకుని మన ఫ్యాక్టరీ లో ఉద్యోగాలు ఇప్పించడం నియోజకవర్గ ప్రజలను మోసం చేయడమే అన్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, నిరుద్యోగ సమస్య బాగా పెరిగి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే స్థితికి చేరుకుందని అన్నారు. బీఎస్పీ అధికారంలోకి రాగానే హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ లలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఒక్క హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని కాకుండా తెలంగాణ అంతటా స్థానికేతరులకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కలిగిస్తుందన్నారు. చివరికి ఎన్నికల స్ట్రాటజీస్ అని చెప్తూ 600 కోట్లు పెట్టి బీహార్ వాసి అయిన ప్రశాంత్ కిషోర్‌నీ నియమించుకున్నారు అంటే కేసీఆర్‌కి తెలంగాణ ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కి, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చాలి అంటే ప్రతి ఒక్కరూ బహుజన సమాజ్ వాది పార్టీ గుర్తు అయిన ఏనుగు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్ధార్థ పూలే, కందికంటి విజయ్, సాంబ శివ గౌడ్ దాసరి శ్రీనివాస్ యాదవ్, సతీష్ రెడ్డి, నరసింహా రావు, జీలకర రామ స్వామి, అమరవరపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.