- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mahesh Babu: శ్రీకృష్జుడిగా మహేష్ బాబు.. కొద్దీ రోజుల్లో థియేటర్లలో చూడబోతున్నాం.. ఇంతకీ ఏ సినిమా అంటే?
దిశ, వెబ్ డెస్క్ : భారతీయ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలపై ఇప్పటికీ ఎన్నో సినిమాలు వచ్చాయి. హనుమాన్ ప్రమోషన్స్ సమయంలో ప్రశాంత్ వర్మ(Prasanth Varma) మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో మహేష్ ( Mahesh Babu) ను కృష్ణుడిగా సెట్ అవుతాడని ఆసక్తికార వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఇప్పుడు నిజంగానే మహేష్ ను కృష్ణుడిగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఏంటో ఇక్కడ చూద్దాం..
'హీరో' మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) మనందరికీ సుపరిచితమే. తాజాగా, ఇతను నటించిన సినిమా 'దేవకీ నందన వాసుదేవ'. 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కథను అందించగా, అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మహేశ్‌బాబు అతిథి పాత్రలో కనిపించనున్నారని,
క్లైమాక్స్‌లో శ్రీ కృష్ణుడికి సంబంధించిన కొన్ని సీన్లు ఉంటాయని, కృష్ణుడి పాత్రలో మహేశ్ నటిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ మహేశ్‌ను ఒప్పించి షూట్ చేశారని తెలిసిన సమాచారం. అయితే, ఆయనను గ్రాఫిక్స్ లో చూపిస్తారా.. లేక నిజంగానే చూపిస్తారా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు చూడాలి. ఈ మూవీని సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు.