- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరిస్తున్నాం : ఇందిరా శోభన్
దిశ, తెలంగాణ బ్యూరో: పంజాబ్ గెలుపుతో రాష్ట్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో నూతనోత్సాహం వచ్చిందని ఆ పార్టీ నేత ఇందిరా శోభన్ అన్నారు. శుక్రవారం ఆమె ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ నేతృత్వంలో పంజాబ్‌లో భారీ మెజార్టీతో గెలిచామని, ధర్మం, జాతి పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలకు ఇది గుణపాఠమన్నారు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ సోమ్నాథ్ భారతి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదరణ పెరుగుతోందని, దక్షిణ భారతదేశం నుంచి వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని అన్నారు.
తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించాలని చూస్తున్నట్లు తెలిపారు. పంజాబ్ ఉన్న పరిస్థితులు తెలంగాణలో కూడా ఉన్నాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని, పంజాబ్ లో గెలిచిన తర్వాత అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్యాయం చేశారని అన్నారు. రాష్ట్రంలో చాలా మంది విద్యావంతులు నిరుద్యోగులుగా మిగిలిపోయారని అన్నారు. రాష్ట్రంలో మాత్రం ఎడ్యుకేషన్, హెల్త్ పాలసీ లేదన్నారు.